BigTV English

OTT Movie : నాలుక కోసి అమ్మాయి హత్య… చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదేం పాడు పనిరా అయ్యా?

OTT Movie : నాలుక కోసి అమ్మాయి హత్య… చచ్చిన శవాన్ని కూడా వదలకుండా ఇదేం పాడు పనిరా అయ్యా?

OTT Movie : తెలుగులో వచ్చిన ఒక రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఒక గ్రిప్పింగ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ఒక అమ్మాయి మర్డర్ కేసు చుట్టూ తిరుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సమయంలో దిమ్మతిరిగే విషయాలు బయటికి వస్తాయి. చివరి వరకు సస్పెన్స్ తో ఈ సినిమా మైండ్ బెండ్ అయ్యే ట్విస్ట్లు ఇస్తుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..


అహాలో స్ట్రీమింగ్

‘కేస్ నం. 30’ 2023లో విడుదలైన తెలుగు క్రైమ్ రొమాన్స్ థ్రిల్లర్ చిత్రం. సందీప్ పైడిమర్రి దర్శకత్వంలో, సిద్ధార్థ్, శమీలి ఉనియల్, తన్వి గవాడే, వంశీ రాఘవ యేనుముల ప్రధాన పాత్రల్లో నటించారు. PNR ఫిల్మ్ ఫ్యాక్టరీ, యువసాయి క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రం 2022 ఏప్రిల్ 1న థియేటర్లలో విడుదలై, 2023 అక్టోబర్ 24న అహాలో అందుబాటులోకి వచ్చింది. 2 గంటల రన్‌టైమ్‌తో ఈ సినిమా IMDbలో 7.0/10 రేటింగ్ అందుకుంది. ఈ సినిమా అహా వీడియోలో తెలుగు ఆడియోతో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే 

అర్జున్ భరద్వాజ్ ఒక క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్. ఒక హత్య కేసును (కేస్ నం. 30) ఛేదించడానికి నియమించబడతాడు. ఈ కేసు ఒక యువతి హత్య చుట్టూ తిరుగుతుంది. ఆమె మృతదేహం నాలుక కోసి దారుణమైన స్థితిలో, జనాలు ఎవరూ సంచరించని ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ కేసులో సాక్ష్యాలు కూడా తక్కువగా ఉంటాయి. అర్జున్ తన తెలివితేటలతో ఈ కేసును లోతుగా విచారించడం ప్రారంభిస్తాడు. అతనికి సహాయంగా కానిస్టేబుల్, ఇతర టీమ్ సభ్యులు ఉంటారు. మొదటి భాగంలో, అర్జున్ సాక్షులను విచారిస్తూ, సీసీటీవీ ఫుటేజ్, ఫోరెన్సిక్ రిపోర్టులను పరిశీలిస్తాడు. కానీ ప్రతి సీన్ అతన్ని ఒక చిక్కుముడిలోకి నడిపిస్తుంది. హత్యకు సంబంధించిన రొమాంటిక్ ఎలిమెంట్‌లు, రాజకీయ ఒత్తిళ్లు కేసును మరింత క్రిటికల్ గా మారుస్తాయి.


రెండవ భాగంలో అర్జున్ ఒక అనూహ్యమైన ట్విస్ట్‌ ఎదురుపడుతుంది. నేరస్థుడు అతనికి సన్నిహితంగా ఉన్న వ్యక్తిగా ఉంటాడు. అర్జున్ దర్యాప్తు మరింత తీవ్రమవుతుంది. ప్రతి ఆధారం అతన్ని నేరస్థుడి వైపు నడిపిస్తుంది. అర్జున్, ఒక రహస్య డాక్యుమెంట్, ఒక రికార్డింగ్ వీడియో ద్వారా నేరస్థుడు ఎవరో గుర్తిస్తాడు. కథ ఒక ఎమోషనల్ క్లైమాక్స్‌తో ముగుస్తుంది. ఆ నేరస్థుడు ఎవరు ? ఎందుకు అమ్మాయిని హత్య చేశాడు ? అర్జున్ కి దొరికిన ఆధారాలు ఏమిటి ? ఆ నేరస్థుడికి శిక్ష పడుతుందా ? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Read Also : కాబోయే సీఈఓతో హోటల్ రూమ్ లో అలాంటి పనులు… బుర్రపాడు సీన్లు… ఈ డార్క్ కామెడీ క్లైమాక్స్ డోంట్ మిస్

Related News

OTT Movie: మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్.. భయంతో వణుకు పుట్టించే హారర్ సీన్లు.. ఒంటరిగా మాత్రం చూడకండి..!

OTT Movie : చస్తేనే మనుషులుగా మారే రాక్షస జీవులు… ఊరిని పట్టి పీడించే వింత శాపం… సీట్ ఎడ్జ్ హర్రర్ థ్రిల్లర్

OTT Movie : ఫస్ట్ నైట్ నాడు ఏం చేయాలో తెలియని ఆణిముత్యం… ఫ్రెండ్ మాట విని భార్యపై అఘాయిత్యం… ఫీల్ గుడ్ మలయాళ డ్రామా

OTT Movie : రాత్రైతే క్రూరంగా మారే భర్త… తెల్లార్లూ అదే టార్చర్… పిల్లలతో చూడకూడని మూవీ

OTT Movie : అంతు చిక్కని ఏలియన్ మిస్టరీ… గవర్నమెంట్ బండారం బట్టబయలు… బుర్రబద్దలయ్యే ట్విస్టులున్న సై-ఫై థ్రిల్లర్

Big Stories

×