AP-TG Temples: ఆదివారం చంద్రగ్రహణం నేపథ్యంలో ఏపీ-తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు వేసివేశారు. గ్రహణం నేపథ్యంలో 12 గంటలపాటు భక్తుల దర్శనాలను నిలిపి వేస్తున్నట్లు సంబంధించి అధికారులు వెల్లడించారు. సోమవారం తెల్లవారుజామున మూడున్నర గంటల మళ్లీ ఆలయాలు తెరచుకోనున్నాయి.
తెలంగాణలో ప్రముఖ ఆలయాలు ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసి వేయనున్నారు. యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మినరసింహా స్వామి, వరంగల్‌లో భద్రకాళి, ములుగులోని రామప్ప రామలింగేశ్వర స్వామి, త్రివేణి సంగమం తీరాన కాళేశ్వర ముక్తీశ్వరస్వామి, వేములవాడ శ్రీ రాజరాజేశ్వరితోపాటు మరికొన్ని ప్రముఖ ఆలయాలు మూతపడనున్నాయి. ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు దర్శనాలకు అనుమతించారు.
ఆ తర్వాత ఆలయ తలుపులను మూసి వేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. నిత్య కైంకర్యాలు తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం మూసి వేస్తారు. సోమవారం వేకువజామున ఆలయాల తలుపులు తెరచుకోనున్నాయి. ఆలయ శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాల తర్వాత యథావిధిగా భక్తులకు దర్శనాలు పునఃప్రారంభం కానున్నాయి.
తిరుమలలో ఆదివారం మధ్యాహ్నం మూడున్నర నుంచి శ్రీవారి ఆలయం మూసివేస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. మళ్లీ సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు తెరవనున్నారు. ఆదివారం మధ్యాహ్నానాటికి దర్శనాలు పూర్తి చేస్తామన్నారు. ఆదివారం కేవలం 30 వేల మందికి దర్శనాలు ఉంటాయని సూచనప్రాయంగా చెప్పారు. దీనికితోడు అన్నప్రసాద కేంద్రాన్ని సైతం మూసి వేస్తున్నట్లు వెల్లడించారు.
ALSO READ: బిడ్డ బారమనుకున్న తల్లి.. మురికి కాలువలోకి విసిరేసింది
తిరుమలకు వచ్చిన భక్తులకు ఏలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసింది టీటీడీ. 50 వేల పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లను సిద్ధం చేసినట్టు చెప్పారు. సోమవారం ఆలయం తెరిచి శుద్ధి చేసిన తర్వాత సుప్రభాతంతో దర్శనాలు ప్రారంభం కానున్నాయి. అప్పటి నుంచి సర్వదర్శనం క్యూలైన్ లోకి భక్తులను దర్శనాలకు అనుమతిస్తామన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలన్నారు.
అటు విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయాన్ని ఇవాళ మధ్యాహ్నం కవాట బంధనంతో మూసి వేయనున్నారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల నుండి ఉదయం 8 వరకు ఆలయంలో శుద్ధి, స్నపనాభిషేకం, అర్చన వంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం ఎనిమిదిన్నర నుంచి భక్తులకు అన్ని రకాల దర్శనాలు మొదలుకానున్నాయి.
చంద్రుడిని కేతువు మింగినప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుందని జ్యోతిష్య నిపుణుల మాట. గ్రహణాలు ఏర్పడే సమయాన్ని చెడుకాలంగా వర్ణిస్తారు. ఆ సమయంలో భూమిపై నేరుగా నీల లోహిత కిరణాలు పడతాయి. వీటివల్ల మానవులకు కీడు కలుగుతుందని పండితులు చెబుతున్నారు. ఆ సమయంలో ఆలయంలోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశాలు ఎక్కువగా ఉందని అంటున్నారు. విగ్రహాలు తమ శక్తిని కోల్పోయే అవకాశం ఉందంటున్నారు. అందుకే ఈ సమయంలో దేవాలయాలను పూర్తిగా మూసివేస్తారు.
గ్రహణం సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పండితులు వివరిస్తున్నారు. సనాతన ధర్మాన్ని ఆచరించేవారు సాయంత్రం 6 గంటల లోప భోజనాలు పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత గ్రహణ సమయం కొనసాగే వరకు ఆహారం తీసుకోకుండా ఉండటమే ఉత్తమమని చెబుతున్నారు. గ్రహణ సమయంలో ప్రయాణాలు, పూజా కార్యక్రమాలకు దూరంగా ఉండాలన్నారు. ఇంట్లోని పూజా మందిరం, నిల్వ ఉండే ఆహార పదార్థాలపై దర్భలను ఉంచాలన్నారు.
చంద్రగ్రహణం సందర్ఫంగా శ్రీశైలం ఆలయ ద్వారాలు మూసివేత..
మధ్యాహ్నం 1 గంట నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేత
గ్రహణం అనంతరం శుద్ధి, సంప్రోక్షణ కార్యక్రమాలు, ఆ తర్వాత భక్తులకు స్వామి దర్శనం pic.twitter.com/gPGFfOaWyK
— BIG TV Breaking News (@bigtvtelugu) September 7, 2025