PM Modi: పాకిస్థాన్ దేశంపై ఇప్పుడు ప్రతి పౌరుడు రగిలిపోతున్నాడు. దయాది దేశం వక్ర బుద్ధి ఏమాత్రం మారడం లేదు. పహాల్గామ్ ఉగ్రదాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న మోదీ సర్కార్ ఈ నెల 7న ఉగ్రవాద శిబిరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో మిసైల్స్ తో విరుచుకపడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత భారత్- పాక్ దేశాల మధ్య పరిణామాలు తీవ్ర స్థాయి చేరాయి. పాక్ గత రెండు రోజుల నుంచి భారత్ పై దాడులకు దిగుతూనే ఉంది. భారత్ త్రివిధ దళాలు ఆ దాడులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.
పాక్ ఆర్మీ డ్రోన్, మిస్సైల్ దాడులను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొని ఎదురుదాడులు కూడా చేసింది. పాక్ డ్రోన్లను, మిసైల్స్ ను ఎక్కడికక్కడా ధ్వంసం చేసి శిథిలాలను స్వాధీనం చేసుకుంటుంది. భారత్ చేస్తున్న మెరుపుదాడులతో గజ గజ వణుకిపోతున్న పాక్… సామాన్య ప్రజలే లక్ష్యంగా సరిహద్దుల్లో దాడులకు దిగుతోంది. భారత త్రివిధ దళాలు అదేస్థాయిలో తిప్పికొడుతున్నా పాకిస్థాన్ కు ఏ మాత్రం బుద్ధి రావడం లేదు. ఈ క్రమంలో కేంద్రంలోని భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశంపై జరిగే ఉగ్రదాడులను యుద్ధంగానే పరిగణించాలని నిర్ణయం తీసుకుంది.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, త్రివిధ దళాధిపతులతో ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి కొన్ని గంటల ముందు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా ప్రధానితో భేటీ అయ్యారు. ఈ భేటీలో మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: Trump on IND PAK War: ది ఎండ్.. భారత్- పాక్ యుద్ధం ముగిసింది.. ట్రంప్ సంచలన ప్రకటన
భవిష్యత్తులో జరిగే ఏ ఉగ్రవాద చర్యను అయినా భారతదేశానికి వ్యతిరేకంగా జరిగే యుద్ధ చర్యగా పరిగణించాలని.. దానికి అనుగుణంగా ప్రతిస్పందించాలని భారతదేశం నిర్ణయించిందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS), భారత సాయుధ దళాల అధిపతులు కూడా ఉన్నారు.
Also Read: India Vs Pakistan War : పెళ్లైన 3 రోజులకే.. ఆర్మీ నుంచి పిలుపు.. భార్య ఏం చేసిందంటే..