BigTV English

Robin Uthappa Arrest : క్రికెటర్ రాబిన్ ఉతప్పకు అరెస్ట్ వారెంట్ జారీ.. ఫ్రాడ్ కేసు

Robin Uthappa Arrest : క్రికెటర్ రాబిన్ ఉతప్పకు అరెస్ట్ వారెంట్ జారీ.. ఫ్రాడ్ కేసు

Robin Uthappa Arrest | భారత మాజీ క్రికటర్ రాబిన్ ఉతప్పకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆయన కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) ఆఫీసులో ఫిర్యాదు చేయగా.. ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రాబిన్ ఉతప్పను అరెస్టు చేయాలని వారెంట్ జారీ చేశారు. దాదాపు రూ.24 లక్షలు ఉద్యోగుల పిఎఫ్ ఫ్రాడ్ కేసు లో రాబిన్ ఉతప్పను నిందితుడిగా పేర్కొంటూ ఆయన విచారణ కోసం హాజరు కావాలని గతంలో నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించక పోవడంతో డిసెంబర్ 4న ఆయనను అరెస్ట్ చేయాలని పోలీసులకు నిర్దేశించారు. కానీ ఆయన ప్రస్తుతం విదేశాల్లో ఉండడంతో తిరిగివస్తారని పోలీసులు ఎదురుచూశారు.


బెంగుళూరుకు చెందిన సెంటారస్ లైఫ్ స్టైల్ బ్రాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ డైరెక్టర్ అయిన మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప.. కంపెనీ ఉద్యోగుల జీతాల నుంచి ప్రావిడెంట్ ఫండ్ మొత్తం మినహాయించినా.. ఆ మొత్తాన్ని ఉద్యోగుల పిఎఫ్ అకౌంట్లో జమ చేయలేదు. ఈపిఎఫ్ నిబంధనల ప్రకారం ఇది చట్ట రీత్యా నేరం. దీంతో కంపెనీ ఉద్యోగలు తమ పిఎఫ్ మొత్తాన్ని ఉపసంహరించుకోవాలని దరఖాస్తు చేసినప్పుడు వారికి ఆ నిధులు అందలేదు. ఈ కారణంగా ఉద్యోగులు కంపెనీ యజమాన్యానికి తమ పిఎఫ్ మొత్తం చెల్లించాలని కోరినా వారు స్పందించకపోవడంతో పిఎఫ్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదులపై స్పందించిన ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ షదాక్షర గోపాల్ రెడ్డి కంపెనీ యజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.

సెంటారస్ లైఫ్ స్టైల్ కంపెనీ ఉద్యోగుల పిఎఫ్ మొత్తం వారి అకౌంట్లలో జమచేయకపోవడంతో పిఎఫ్ సెటిల్ మెంట్ సమస్యలు ఎదరవుతున్నాయని ఈ కారణంగా వెంటనే ఆ మొత్తం జమచేయాలని జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. అయినా యజమాన్యం స్పందించలేదు. దీంతో కంపెనీ డైరెక్టర్ రాబిన్ ఉతప్పని అరెస్ట్ చేయాలని ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ బెంగుళూరు పులకేశీనగర్ పోలీసులకు డిసెంబర్ 4న నిర్దేశించారు.


Also Read: దేశంలో జోరుగా సాగుతున్న రహస్య బిజినెస్.. ప్రేమ వివాహాలే టార్గెట్

పోలీసులు రాబిన్ ఉతప్ప కోసం ఆయన ఇంటికి వెళ్లగా ఆయన ఇటీవలే ఇండియా వదిలి దుబాయ్ లో కుటుంబ సమేతంగా స్థిరపడినట్లు తెలిసింది. అయితే ఆయనను సంప్రదించాలని పోలీసులు ఇంతకాలం ప్రయత్నించారు. కానీ ఉతప్ప స్పందించకపోవడంతో ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు.

ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 405 ప్రకారం.. రాబిన్ ఉతప్ప క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఆరోపణలు నమోదయ్యాయి. అయితే అరెస్ట్ వారెంట్ ఉన్నా ఆయను కొన్ని రోజుల గడువు ఇవ్వడం జరగుతుంది. డిసెంబర్ 27 లోపు రాబిన్ ఉతప్ప పిఎఫ్ మొత్తాన్ని చెల్లిస్తే ఈ అరెస్ట్ వారెంట్ రద్దు చేసే అవకాశం ఉంది. అలా కానీ పక్షంలో రాబిన్ ఉతప్ప పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పిఎఫ్ కమిషనర్ చెప్పారు.

రాబిన్ ఉతప్ప క్రికెట్ కెరీర్
రాబిన్ ఉతప్ప (Robin Uthappa) 59 అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఐపిఎల్ కూడా ఆయన రాణించారు. ఆయన 54 వన్డే క్రికెట్ మ్యాచ్ లలో 1183 పరుగులు చేశారు ఇందులో 7 అర్ధ సెంచరీలున్నాయి. ఐపిఎల్ విషయానికి వస్తే.. ఆయన కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ టీమ్స్ లో ఆడారు. 2014 ఐపిఎల్ కప్ గెలిచిన కోల్ కతా టీమ్ లో ఆయన కీలక పాత్ర పోషించారు.

Related News

Bigg Boss Telugu 9: సంజన సీక్రెట్ బయటపెట్టి షాకిచ్చిన మనీష్.. వరస్ట్ ప్లేయర్ శ్రీజ, ప్రియకు బిగ్ బాంబ్!

Bigg Boss Telugu 9 Day 13: సంజన, ఫ్లోరా గుట్టురట్టు చేసిన నాగార్జున.. ఆమె జైలుకి, హౌజ్ మేట్స్ కి బిగ్ ట్విస్ట్

Bigg Boss 9 Promo: తనూజా చేతే లవ్ సీక్రెట్ బయటపెట్టించిన నాగ్!

Bigg Boss 9 Telugu : మళ్లీ కెప్టెన్ అయ్యాడు.. ఆడియన్స్ కు బిగ్ బాస్ పిచ్చెక్కిస్తున్నాడే..

Bigg Boss 9: 2వారాలకు గానూ మర్యాద మనీష్ ఎంత సంపాదించారో తెలుసా?

Bigg Boss Telugu 9 day 13: తు.. తు.. నువ్వు ఆగమ్మా.. దమ్ము శ్రీజకి నాగ్ కౌంటర్, ప్రియకు ఝలక్.. ఓనర్స్ గా మారిన సెలబ్రిటీలు

Bigg Boss Telugu 9 Day 13: రీతూ బండారం బయపెట్టిన నాగ్.. భరణికి అన్యాయం, డిమోన్ కెప్టెన్సీ రద్దు..

Bigg Boss 9: ప్రియా శెట్టి పగిలిపోయే వార్నింగ్ ఇచ్చిన కింగ్, డిమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు

Big Stories

×