Intinti Ramayanam Today Episode September 7th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఉదయం లేవగానే అక్షయ్ ఆఫీస్ కి వెళ్లాలని హడావిడిగా రెడీ అవుతాడు. అర్జెంటుగా ఫైలు తీసుకురమ్మని వాళ్ళ బాస్ ఫోన్ చేస్తుంది అయితే ఆటోలనీ క్యాబ్ లని ఎంతగా బుక్ చేసినా సరే రాము అని అంటారు.. ఇక రాజేంద్రప్రసాద్ అక్షయ్ దగ్గరకు వచ్చి నువ్వు అడగడానికి మొహమాటపడుతున్నావేమో అవనీతో వెళ్లొచ్చు కదా అని అంటాడు.. టైం అవుతుందని అక్షయ్ అవని దగ్గరికి వెళ్లి బ్రతిమలాడుతాడు. ఇద్దరూ కలిసి వెళ్తారు. అక్షయ్ అవనికి థాంక్స్ చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఈ క్రమంలో అతని ఫైల్ లోని ముఖ్యమైన పేపర్ కింద పడిపోతుంది. అక్షయ్ హడావిడిగా లోపలికి వెళ్లి ఆ ఫైల్ ని తన మేడం కి ఇస్తాడు..
ఆమె అంతా చెక్ చేసి అందులో ఒక పేపర్ మిస్ అయిందని చెప్తుంది. ముఖ్యమైన పేపర్ నేను మిస్ చేసావు ఇలా నెగ్లెట్ గా ఉండడం ఏంటి అని అడుగుతుంది. నేనేమీ మిస్ చేయలేదు మేడమ్ తీసుకొచ్చాను అని అంటాడు కానీ అక్షయ్ ఇక ఫైలు ఇచ్చి వెతకమని అంటుంది. అక్షయ్ నిజంగా నా పేపర్ ఎక్కడో మిస్ అయింది మేడం అని అంటాడు. భార్యలతో సంతోషంగా ఉండడం మాత్రమే కాదు పని కూడా చేయాలి ఇది లేకపోతే నా దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు నీ ప్లేస్ లో ఇంకొకరు ఉంటే ఈపాటికి ఉద్యోగం నుంచి పీకి పడిసే దాన్ని అని ఆమె అంటుంది. అవని రావడంతో అక్షయ్ సేఫ్. అవని పై అక్షయ్ పొగడ్తల అవనిని ముంచేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ప్రోమో విషయానికొస్తే.. పల్లవి ఎలాగైనా సరే అత్తయ్య నీ బుట్టలో వేసుకోవాలని అనుకుంటుంది. కానీ కమల్ మాత్రం పల్లవికి షాక్ ఇస్తాడు. నువ్వేమీ మా అమ్మకు పెట్టాల్సిన అవసరం లేదు నేను మా అమ్మకు తినిపిస్తాను అని అంటాడు. ఇక పార్వతికి కమల్ ఓదార్చి అన్నం తినేలా చేస్తాడు. కమల్ మాటలు విన్న పల్లవి ఈ ఇంటిని ముక్కలు చేయకుండా అస్సలు వదలను అని అనుకుంటుంది. అమలు మాత్రం ఇద్దరు కోడలు వచ్చిన తర్వాత ఇల్లు ఇలా మారింది అని అనుకుంటారు. త్వరలోనే మన ఇల్లు మళ్లీ సంతోషంగా ఉండేలా అవని వదిన చేస్తుందమ్మా నువ్వేం బాధపడకు అని అంటాడు.
అవనిని ఇంటికి శాశ్వతంగా దూరం చేసే పనిలో నేను ఉన్నాను అంత సినిమా లేదు అని పల్లవి మనసులో అనుకుంటుంది. ఇక శ్రీయ భరత్ ని పిలిచి వీధి చివర టైలర్ షాప్ ఉంది నా బ్లౌజులు కాస్త లూజ్ చేయించుకుని రావాలి అడుగుతుంది. అది మొదటి విన్న భరత్ షాక్ అవుతాడు. ఆ తర్వాత ప్రణతి వచ్చి మా ఆయనే ఉన్న నీకు పనిమనిషి అనుకుంటున్నావా? ఎలాంటి విషయాలు చెప్తున్నావు వదిన అనేసి అడుగుతుంది. ఇంట్లో ఖాళీగా ఉన్నాడు కదా అందుకే చెప్పాను అని శ్రియ అంటుంది.
అప్పుడే అక్కడికి వచ్చిన పల్లవి మనం అవునన్నా కాదన్నా భరత్ ఇప్పుడు ఏంటి అల్లుడు మనం బాగా చూసుకోవాలి. ఇలా చిన్న విషయాలకి అవమానిస్తావని అంటుంది. భరత్ నీ అక్కడి నుంచి ప్రణతి తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ భరత్ కచ్చితంగా మన వైపు తిప్పుకోవాలి అని పల్లవి అనుకుంటుంది. ఆ తర్వాత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. పార్వతిని చూసిన అవని ఏమి అత్తయ్య గారు. ఇలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారు అని అడుగుతుంది. దానికి పార్వతి మన ఇంట్లో జరిగిన విషయాన్ని చెప్తుంది.
Also Read:Gudi సంజయ్ ను ఆడుకున్న బాలు.. పెళ్లి రోజున ప్రభావతికి షాక్.. సుశీల వార్నింగ్..
మీరేం బాధపడకండి అత్తయ్య గారు నేను చూసుకుంటాను అంత త్వరలోనే సెట్ అవుతుంది అని అంటుంది. శ్రీకర్ కోసం అవని ఒకచోటకు వెళుతుంది. అక్కడ శ్రీకర్ మాట విన్నావని షాక్ అవుతుంది. ఇక నీ పనులకి రాడు అని శ్రియ వార్నింగ్ ఇస్తుంది. శ్రీయ అన్న దాంట్లో తప్పు లేదు అని శ్రీకర్ కూడా అంటాడు.. అసలు ఏమైంది శేఖర్కి అని అవని అనుకుంటుంది అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..