శామ్‌సంగ్ భారతదేశంలో కొత్తగా AI వాషింగ్ మెషీన్ ఇటీవలే లాంచ్ చేసింది. బిస్పోక్ (Bespoke AI) వాషర్ డ్రైయర్ పేరుతో దీన్ని విడుదల చేసింది. ఇది మొట్టమొదటి AI టెక్నాలజీ ఆధారిత వాషింగ్ మెషిన్. ఇది హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీతో లాండ్రీని సులభతరం చేస్తుంది. ఈ మెషిన్ 12 కిలోల బట్టలను శుభ్రం చేయగలదు. అలాగే 7 కిలోల బట్టలను ఆరబెట్టగలదు. ఇది పెద్ద కుటుంబాలు లేదా ఎక్కువ మంది కలిసి వాషింగ్ మెషీన్ వినియోగించే వారికి అనువైన మెషీన్.
ధర, లభ్యత
శామ్‌సంగ్ బిస్పోక్ AI వాషర్ డ్రైయర్ ధర రూ. 63,990 నుండి ప్రారంభమవుతుంది. దీనిని శామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్ నుండి లేదా స్థానిక రిటైల్ షాపులు, పెద్ద ఈ-కామర్స్ సైట్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. శామ్‌సంగ్ 20 సంవత్సరాల వారంటీని అందిస్తోంది, ఇది వినియోగదారులకు నమ్మకాన్ని ఇస్తుంది.
స్మార్ట్ వాషింగ్ ఫీచర్స్
ఈ వాషింగ్ మెషిన్ 12 కిలోల బట్టలను శుభ్రం చేసి, 7 కిలోల బట్టలను ఆరబెట్టగలదు. ఇందులోని AI వాష్ ఫీచర్ 5- స్టెప్ సెన్సింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. ఇది బట్టల బరువు, మెత్తదనం, ఎంత మురికి ఉందో లెవెల్స్ ని గుర్తించి, అవసరమైన డిటర్జెంట్ మొత్తాన్ని ఆటోమెటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. AI ఎకోబబుల్ టెక్నాలజీ బట్టలను 20% మెరుగ్గా శుభ్రం చేస్తుంది. ఇది మురికిని తొలగించడంతో పాటు బట్టలను మెత్తగా, తాజాగా ఉంచుతూ వాటిని రక్షిస్తుంది.
ఉపయోగించడానికి సులభం
ఈ మెషిన్ డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది, దీనివల్ల 70 శాతం వరకు విద్యుత్ శక్తిని ఆదా చేయవచ్చు. ఇది నీటిని తక్కువగా వాడుతూ, శబ్దం లేకుండా నడుస్తుంది, కాబట్టి మీ ఇంట్లో శాంతి భంగం కాదు. ఈ మెషిన్ ఎక్కువ కాలం పనిచేసేలా రూపొందించబడింది మరియు తక్కువ శక్తితో ఎక్కువ సామర్థ్యాన్ని అందిస్తుంది. సూపర్‌స్పీడ్ ఫీచర్ ద్వారా పూర్తి లోడ్ బట్టలను కేవలం 39 నిమిషాల్లో శుభ్రం చేస్తుంది, బట్టలను రక్షిస్తూ లోతైన శుభ్రతను అందిస్తుంది.
నీళ్లు లేకుండానే వాషింగ్ – ఎయిర్ వాష్ టెక్నాలజీ
ఎయిర్ వాష్ అనేది ఒక విప్లవాత్మక ఫీచర్. ఇది నీరు లేదా డిటర్జెంట్ లేకుండా బట్టలు, బెడ్డింగ్‌ను రిఫ్రెష్ చేస్తుంది. దుర్వాసనలను తొలగించి, బట్టలను తాజాగా, ధరించడానికి సిద్ధంగా చేస్తుంది. ఈ ఫీచర్ లాండ్రీ సమయాన్ని తగ్గిస్తుంది. బట్టలను మంచి స్థితిలో ఉంచుతుంది.
స్మార్ట్‌థింగ్స్‌తో మడతలు లేని డ్రైయింగ్
స్మార్ట్‌థింగ్స్ రింకిల్ ప్రివెంట్ ఫీచర్ బట్టలను మడతలు లేకుండా ఉంచుతుంది, ఇస్త్రీ చేయాల్సిన అవసరాన్ని తగ్గిస్తుంది. బట్టలు మృదువుగా, ధరించడానికి సిద్ధంగా బయటకు వస్తాయి. ఈ ఫీచర్ ఆధునిక గృహాలకు టెక్నాలజీ సౌలభ్యం కచ్చితమైన కలయిక.
శామ్‌సంగ్ బిస్పోక్ AI ఎందుకు ఎంచుకోవాలి?
ఈ వాషర్ డ్రైయర్ నగర కుటుంబాలకు అనువైనది. AI ఫీచర్స్ లాండ్రీని స్మార్ట్‌గా, వేగంగా చేస్తాయి. కరెంట్ ఆదా చేస్తూ.. బట్టలను రక్షించే అధునాతన టెక్నాలజీతో పనిచేస్తుంది. 20 సంవత్సరాల వారంటీ దీని క్వాలిటీ, విశ్వసనీయతను చూపిస్తుంది. శామ్‌సంగ్ యొక్క ఈ ఆవిష్కరణ లాండ్రీ సంరక్షణలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతుంది.