Vinod Kambli Networth| భారత క్రికెట్ జట్టులో ఒకప్పుడు స్టార్ ఆటగాడిగా వెలిగిన వినోద్ కాంబ్లి ఇటీవల మళ్లీ హాట్ టాపిక్‌గా నిలిచారు. కొన్ని రోజుల క్రితమే క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో ఆయన ఒక కార్యక్రమంలో కలిశారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో నెటిజెన్లు తెగ చర్చించుకుంటున్నారు. ఆయన గురించి వార్తలు, ప్రచారాలు బాగానే వైరల్ అవుతున్నాయి. ఒక వైరల్ అవుతున్న వీడియోలో ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారని కనిపిస్తోంది. కానీ ఒకప్పుడు ఆయనను అందరూ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) తో సమానంగా చూసేశారు. అంతే కాదు సచిన్ తరువాత నెక్స్ట్ స్టార్ బ్యాట్స్ మెన్ గా ఆయనను ఊహించుకునేవారు.
కానీ ఆయన చెడు అలవాట్లకు బానిసై, క్రికెట్ ను నిర్లక్ష్యం చేశారు. ఈ కారణాలతోనే ఆకాశంలో ఉండాల్సిన ఆయన కెరీర్‌ను పాతాళానికి పడిపోయింది. ఈ రోజు ఆయన ఆరోగ్యం చేస్తే.. 52 ఏళ్ల వయసులో వినోద్ కాంబ్లి 75 ఏళ్ల వ్యక్తి గా బలహీనంగా కనిపిస్తున్నారు. టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లిని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇటీవలే వారి కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ మెమోరియల్ ఈవెంట్ లో (స్మారకోత్సవ కార్యక్రమం) కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సచిన్ స్వయాన వెళ్లి కూర్చొని ఉన్న వినోద్ కాంబ్లితో చేతులు కలిపారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ రోజు వినోద్ కాంబ్లి ఆర్థిక పరిస్థితి దీనంగా ఉంది. ఆయన డబ్బుల కోసం చాలాసార్లు స్నేహితుల వద్ద సాయం అడిగినట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ఒకప్పుడు ఆయన ఆస్తి కోట్లలో ఉండేది. అయితే ప్రస్తుతం ఆయన ఆస్తి ఎంతో తెలుసా?
ఒకప్పటి కోటీశ్వరుడు
1990వ దశకంలో టీమిండియా స్టార్ ఆటగాడైన వినోద్ కాంబ్లి 1991 సంవత్సరంలో జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టారు. తన ఆటతీరుతో ఆయన అభిమానులను కట్టిపడేసేవారు. తక్కువ కాలంలోనే వినోద్ కాంబ్లి కోట్లలో సంపాదించారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు వినోద్ కాంబ్లి వద్ద 1990 దశకంలోనే 1.5 మిలియన్ డాలర్ల ఆస్తి ఉండేది. అదే 2022 వరకు ఆయన బ్యాంక్ అకౌంట్లో కేవలం రూ.4 లక్షలు మాత్రమే ఉన్నాయని సమాచారం.
పెన్షన్‌తో జీవనం సాగిస్తున్న కాంబ్లి
2022తో పోలిస్తే వినోద్ కాంబ్లి ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. ఆయనకు పెన్షన్ తప్ప మరే ఇతర ఆదాయం లేదు. బిసిసిఐ ఇచ్చే పెన్షన్ తోనే ఆయన జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలల క్రితం వినోద్ కాంబ్లి ఒక ఇంటర్‌వ్యూలో మాట్లాడుతూ తనకు ప్రతినెలా కేవలం రూ.30000 పెన్షన్ రూపంలో అందుతోందని.. ఆ డబ్బులతోనే తన ఇల్లు గడుస్తోందని చెప్పారు.
కాంబ్లి క్రికెట్ కెరీర్
2009 సంవత్సరంలో వినోద్ కాంబ్లి అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఆ తరువాత 2011 సంవత్సరంలో దేశవాళీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి కూడా రిటైర్మెంట్ ప్రకటించారు. ఇండియా కోసం కాంబ్లి 17 టెస్ట్ మ్యాచ్ లు, 104 వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యచ్ లు ఆడారు. ఆయన టెస్ట్ క్రికెట్ లో 54.20 శాతం స్ట్రైట్ రేట్ తో 1084 పరుగులు చేశారు. అందులో నాలుగు సెంచరీలు, మూడు అర్ధసెంచరీలు ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో ఆయన 32.59 యావరేజ్ తో 2477 పరుగులు చేశారు. వీటిలో కేవలం 2 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలున్నాయి.