OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపే చూస్తున్నారు ప్రేక్షకులు. ఏ భాషలో సినిమాలు వచ్చినా కంటెంట్ బాగుంటే, ఇక వాటిని వదిలి పెట్టకుండా వీక్షిస్తున్నారు. ప్రధానంగా హాలీవుడ్ సినిమాలను ఎక్కువగా సెర్చ్ చేస్తుంటారు. వీటిలో కూడా హారర్ సినిమాలను చూడటానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా ఒక తోడేలు శాపంతో నడుస్తుంది. ఆ శాపం ఎలా వచ్చింది ? దానివల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి ? ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
19వ శతాబ్దం చివరలో, ఫ్రాన్స్‌లోని ఒక గ్రామంలో, సీమస్ లారెంట్ అనే ఒక ధనవంతుడైన భూస్వామి, తన భూమిపై హక్కు కోసం వచ్చిన రోమాని తెగను దారుణంగా ఊచకోత కోస్తాడు. ఈ ఊచకోతలో రోమాని నాయకురాలు చనిపోయే ముందు, వెండి పళ్ళు ఉన్న తోడేలు రూపంలో ఒక శాపాన్ని పెట్టి పోతుంది. ఈ శాపం వల్ల గ్రామ ప్రజలు, ముఖ్యంగా సీమస్ పిల్లలు ఎడ్వర్డ్ షార్లెట్ వెండి పళ్ల గురించి భయంకరమైన కలలతో వేధించబడతారు. ఒక రోజు స్థానిక బాలుడు టిమ్మీ, ఈ కలల ప్రభావంతో, వెండి పళ్లను తవ్వి వాటిని నోటిలో పెట్టుకుని ఎడ్వర్డ్‌ను కరుస్తాడు. దీనితో ఎడ్వర్డ్ అదృశ్యమవుతాడు. గ్రామంలో దారుణమైన హత్యలు జరగడం మొదలవుతుంది. దీనిని ఒక అడవి జంతువు చేసిందని స్థానికులు అనుమానిస్తారు. జాన్ మెక్‌బ్రైడ్ అనే ఒక పాథాలజిస్ట్, ఈ హత్యలను పరిశోధించడానికి గ్రామానికి వస్తాడు. అతను గతంలో ఇలాంటి శాపంతో తన కుటుంబాన్ని కోల్పోయిన వ్యక్తి.
జాన్ ఈ శాపం ఒక వెరీవోల్ఫ్ లాంటి జీవి ద్వారా వ్యాపిస్తుందని గుర్తిస్తాడు. ఎడ్వర్డ్ ఈ శాపంతో ఒక రాక్షస జీవిగా మారిపోతాడు. జాన్ సీమస్ భార్య ఇసాబెల్ సహాయంతో, ఈ జీవిని చంపడానికి ప్రయత్నిస్తాడు. వెండి పళ్లను కరిగించి నాలుగు వెండి బుల్లెట్లను తయారు చేస్తాడు. కానీ ఆ జీవిని పూర్తిగా ఆపలేడు. క్లైమాక్స్ ఒక భయంకరమైన ఫైట్ సీన్ తో ఎండ్ అవుతుంది. జాన్ ఆ తోడేలును అంతం చేస్తాడా ? తోడేలు వల్ల ఎంతమంది ప్రాణాలు పోతాయి ? ఈ క్లైమాక్స్ ఎలాంటి ముగింపును ఇస్తుంది. అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్ సినిమాను చూడాల్సిందే.
‘Eight for Silver’ సీన్ ఎల్లిస్ దర్శకత్వం వహించిన అమెరికన్ ఫ్రెంచ్ హారర్ సినిమా. ఇందులో బాయిడ్ హోల్‌బ్రూక్, కెల్లీ రీల్లీ, ఆలిస్టైర్ పెట్రీ, రోక్సాన్ డురాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2021 జనవరి 30న సన్‌డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పేరుతో ప్రీమియర్ అయింది. 2022 ఫిబ్రవరి 18న The Cursed పేరుతో థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం Netflix, Amazon Prime Videoలో స్ట్రీమింగ్ అవుతోంది. 113 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమా IMDbలో 6.2/10 స్కోర్ సాధించింది.