ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది బట్టతలతో బాధపడుతున్నారు. చిన్న వయసులోనే జుట్టురాలడంతో ఆత్మన్యూనతకు లోనవుతున్నారు. ఆడవాళ్లను కూడా ఈ సమస్య ఎంతగానో వేధిస్తోంది. జుట్టురాలడం, విరిగిపోవడం, చిట్లిపోవడం సహా పలు ప్రాబ్లమ్స్ తో ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా బట్టతల బాధితులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరిశోధకులు ఆదిశగా ప్రయోగాలు మొదలు పెట్టారు. బట్టతల మీద నేచురల్ గా జుట్టు మొలిపించే ఔషధాన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయోగాల్లో పెలేజ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ కీలక ముందడుగు వేసింది. PP405 అనే ఔషధాన్ని కనిపెట్టింది. ప్రస్తుతం ఈ ఔషధం అభివృద్ధి దశలో ఉంది. ఇది జుట్టు కుదుళ్లలోని స్టెమ్ సెల్స్ ను ఉత్తేజపరిచి, నిద్రాణస్థితిలో ఉన్న కుదుళ్లను యాక్టివేట్ చేస్తుంది. సహజ జుట్టు పెరిగేలా ప్రోత్సహిస్తుందని పరిశోధకులు వెల్లడించారు.
⦿ PP405 పనితీరు: PP405 ఔషధం హార్మోన్లపై ఆధారపడే సాంప్రదాయ చికిత్సలైన మినాక్సిడిల్, ఫినాస్టరైడ్ కు భిన్నంగా పని చేస్తుంది. జుట్టు కుదుళ్ల స్టెమ్ సెల్స్ ను యాక్టివేట్ చేస్తుంది. ప్రస్తుతం ఫేజ్ 2A క్లినికల్ ట్రయల్స్ కొనసాగుతున్నాయి. ఇందులో 31% పురుషులు 8 వారాల్లో 20% కంటే ఎక్కువ జుట్టు ఏర్పడింది. ఇది గతంలో జుట్టు లేని ప్రాంతాల్లో కూడా కొత్త జుట్టు పెరుగుదలను ప్రేరేపించినట్లు పరిశోధకులు గుర్తించారు.
⦿ సహజంగా జుట్టు పెరుగుదల: PP405 జుట్టు కుదుళ్ల సహజ పెరుగుదల చక్రాన్ని ప్రేరేపిస్తుంది. హార్మోన్లను మార్చకుండా, రక్త ప్రవాహాన్ని పెంచకుండా సాంప్రదాయ చికిత్సల నుంచి భిన్నంగా ఉంటుంది. ఇది లాక్టేట్ ఉత్పత్తిని పెంచడం ద్వారా స్టెమ్ సెల్స్ ను యాక్టివేట్ చేస్తుంది. ఇది కుదుళ్లను రీజనరేట్ చేయడానికి సాయపడుతుంది. ఫలితంగా జుట్టు సహజంగా పెరుగుతుంది.
⦿ సురక్షితమైన చికిత్స: ఇది టాపికల్ జెల్ గా రోజుకు ఒకసారి స్కాల్ప్ పై అప్లై చేయబడుతుంది. ఇది నాన్-ఇన్వాసివ్. ఫేజ్ 2A ట్రయల్స్ లో ఎటువంటి సిస్టమిక్ సైడ్ ఎఫెక్ట్స్, రక్తంలో ఔషధ శోషణం గుర్తించలేని పరిశోధకులు తెలిపారు. ఇది సురక్షితమైన ఔషధంగా భావిస్తున్నట్లు వెల్లడించారు.
⦿ PP405 ప్రస్తుత స్థితి: PP405 ప్రస్తుతం ఫేజ్ 2A క్లినికల్ ట్రయల్స్ లో ఉంది. ఫేజ్ 3 ట్రయల్స్ 2026లో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. ఇది ఇంకా FDA ఆమోదం పొందలేదు. 2027-2030 మధ్య మార్కెట్ లో అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు.
ప్రస్తుతం PP405 అందుబాటులో లేనందున, సహజ జుట్టు పెరుగుదల కోసం ఇతర ఆప్షన్స్ ను పరిశీలించవచ్చు.
⦿ మినాక్సిడిల్: స్కాల్ప్ కు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
⦿ రోజ్మేరీ ఆయిల్: ఇది మినాక్సిడిల్ తో సమానమైన ప్రభావాన్ని చూపుతుంది. సహజంగా జుట్టు పెరగడంలో సాయపడుతుంది.
⦿ ప్లేట్‌లెట్-రిచ్ ప్లాస్మా (PRP) థెరపీ: స్టెమ్ సెల్స్ ను ఉత్తేజపరిచేందుకు స్కాల్ప్ లో ప్లేట్ లెట్స్ ఇంజెక్ట్ చేస్తారు. ఇది జుట్టు డెన్సిటీని మెరుగుపరుస్తుంది.
⦿ సమతుల ఆహారం: బయోటిన్, జింక్, ఐరన్, విటమిన్ D వంటి పోషకాలు జుట్టు ఆరోగ్యానికి సహాయపడతాయి.
⦿ స్కాల్ప్ మసాజ్: రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
Read Also: జుట్టు రాలుతుందా? ఈ విటమిన్ లోపాలే కారణం, జస్ట్ ఇలా చేస్తే నిగనిగలాడే కురులు మీ సొంతం!