BigTV English

Hyderabad News: హైదరాబాద్ సిటీ.. కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు, నేటి సాయంత్రానికి పూర్తి

Hyderabad News: హైదరాబాద్ సిటీ.. కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు, నేటి సాయంత్రానికి పూర్తి

Hyderabad News: భాగ్యనగరం హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలు వైభవంగా సాగుతున్నాయి. హుస్సెన్ సాగర్‌తోపాటు అధికారులు ఏర్పాటు చేసిన పలు చెరువుల వద్ద నిమజ్జనాలు జరుగుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల శివారు ప్రాంతాల గణేష్ మండపాలను శనివారం తీశారు.  రాత్రంతా డప్పు చప్పుళ్లు, భక్తి పాటలతో ఊరేగింపు మొదలైంది.


నిమజ్జనానికి వస్తున్న వాహనాలతో ఆదివారం ఉదయం పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. కొన్ని ప్రాంతాలకు ఇంకా సిటీ బస్సులు అనుమతించలేదు పోలీసులు. ఆదివారం సాయంత్రం నాటికి పూర్తి కావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సిటీలో ఇంకా వెయ్యి గణనాథుడి విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉన్నట్లు ఓ అంచనా.

ఆదివారం సాయంత్రం నాటికి నిమజ్జనాలు కొనసాగుతాయని అంటున్నారు అధికారులు. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఈసారి టెక్నాలజీ ఆధారంగా విగ్రహాల నిమజ్జనం జరుగుతోంది. జియో ట్యాగింగ్‌తో విగ్రహాల గుర్తింపు, వివరాల నమోదు తర్వాత నిమజ్జనానికి విగ్రహాలు బయలుదేరాయి.


డ్రోన్ కెమెరాల ద్వారా గణేష్‌ నిమజ్జనాల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు కంటిన్యూ అవుతోంది. నార్మల్‌గా అయితే ఖైతరాబాద్ గణేశ్‌తో నిమజ్జనాలు ముగిస్తాయి. ఆదివారం గ్రహణం నేపథ్యంలో శనివారం తెల్లవారుజాము నుంచే ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహాన్నియాత్ర మొదలైంది. మధ్యాహ్నం రెండు గంటలో ముగిసింది.

ALSO READ: హైదరాబాద్ లో ఇన్ని లక్షల గణేషుడి ప్రతిమలా?

అందులో పాల్గొన్న భక్తులు తమ ప్రాంతాలకు వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత అర్థరాత్రి నుంచి శివారు ప్రాంతాల్లో నిమజ్జనానికి గణేషుడి విగ్రహాలు బయలుదేరాయి. గతంలో కంటే ఈసారి విగ్రహాల సంఖ్య భారీగా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. నిమజ్జనాలకు బయలుదేరే సమయంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.

మిడ్ నైట్ నుంచి ప్రాంతాల వారీగా పునరుద్ధరించుకుంటూ వస్తున్నారు. ఇంటర్నెట్ సేవలు సైతం ఇప్పుడిప్పుడే పలు ప్రాంతాల్లో మొదలయ్యాయి. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.  ఇప్పటివరకు 90 శాతం గణేష్ విగ్రహాల నిమజ్జనం పూర్తి అయ్యింది. పీపుల్స్ ప్లాజా మార్గంలో పలు క్రేన్లు మొరాయిస్తుండడంతో ఆలస్యంగా నిమజ్జనాలు జరుగుతున్నాయి.

 

 

Related News

GHMC Hyderabad: హైదరాబాద్‌లో.. ఇన్ని లక్షల గణేషుడి ప్రతిమలా! జీహెచ్ఎంసీ కీలక ప్రకటన!

Hyderabad Tank Bund: గణనాథుడి నినాదాలతో మార్మోగిన హైదరాబాద్.. శోభాయాత్రలో పోలీసుల డాన్స్

Hyderabad Water: హైదరాబాద్‌లో రెండు రోజులు నీళ్లు బంద్.. ఏ ఏరియాల్లో అంటే?

CM Revanth Reddy: సామాన్యుడిలా ట్యాంక్ బండ్ వద్దకు సీఎం రేవంత్ రెడ్డి

Hyderabad Drug: హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. 12 వేల కోట్ల మాదక ద్రవ్యాలు సీజ్

Big Stories

×