Little Hearts: సెప్టెంబర్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చింది లిటిల్ హార్ట్స్ సినిమా. ఈ సినిమా ఇప్పుడు కొద్దిపాటి సంచలనం అని చెప్పాలి. సినిమా పడిన మొదటి షో నుంచే విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ ఈ సినిమాకు వచ్చింది. యునానిమస్ గా హిట్ టాక్ రావడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. మామూలుగా మొదటి రోజు నుంచి కలెక్షన్లు ఎక్కువ వస్తూ రోజులు గడుస్తున్న కొద్ది తగ్గుతూ ఉంటాయి. కానీ ఈ సినిమా విషయంలో డిఫరెంట్. కేవలం మౌత్ టాక్ వలన సినిమా హిట్ అవడంతో. మొదటి రోజు కంటే కూడా మూడవ రోజు సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయి.
ఇక ఇక్కడ చూసినా కూడా ఈ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. ఒక సినిమాకి హౌస్ ఫుల్ బోర్డు కనబడటం అనేది మామూలు విషయం కాదు. ఈ రోజుల్లో ఆడియన్స్ థియేటర్ కు రావడం తగ్గించేశారు. చాలా చోట్ల షోస్ క్యాన్సిల్ అయిపోతున్నాయి. అటువంటి తరుణంలో కూడా ఈ సినిమాకి విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అంటే మామూలు విషయం కాదు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా యూఎస్ లో కూడా ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది.
యుఎస్ లో తెలుగు సినిమా ప్రేక్షకులు ఉన్నారని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మన సినిమాలు అక్కడ రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే వాళ్లు కూడా బ్రహ్మరథం పడతారు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ సినిమాకు అదే జరుగుతుంది. ఈ సినిమాకు విపరీతమైన పాజిటివ్ టాక్ యూఎస్ లో కూడా వస్తుంది. అంతేకాకుండా అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. నేటి వరకు ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఇవే.
#LittleHearts Crossed #400K Mark in #NorthAmerica
Day1 : $115K
Day2 : $159K
Day3 : $149K
Total Gross : $423,008 [₹3.73 Crs]
దీనిపైన హీరో మౌళి తనుజ్ (Mauli talks) స్పందించాడు. ట్రంప్ తో మీటింగ్ పెడతాను అంటూ ఎడిట్ చేసిన ఫోటో పెట్టాడు. ఇప్పుడు ఆ ఫోటో కూడా వైరల్ గా మారుతుంది. సరిగ్గా ఇదే కామెడీ టైమింగ్ మౌళి లో నచ్చడం వల్ల ఈరోజు సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. కేవలం సినిమా తోనే కాకుండా సినిమా ప్రమోషన్స్ తోనే చాలామందిని ఆకర్షించడం మౌలి. ఇప్పుడు ఉన్న జనరేషన్ కి మౌళి ఒక ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పొచ్చు. టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు కూడా ఈ సినిమాపై ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు.
Also Read: Allu Arjun: అఖీరా బాబు కటౌట్ చూసి అల్లు అర్జున్ షాక్, ఇంత పొడుగు ఉన్నావేంటి అల్లుడు