OTT Movie : హైదరాబాద్ నేపథ్యంలో సూపర్‌నా చురల్ కామెడీగా రూపొందిన ‘బకాసుర రెస్టారెంట్’ సినిమాకు థియేటర్లలో మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్‌లో ఈ సినిమా సగటు వసూళ్లు సాధించింది. కానీ ఈ సినిమా ఓటీటీలో ఎక్కువ ఆదరణ పొందే అవకాశం ఉంది. బకాసురుడు అనే ఒక పౌరాణిక రాక్షసుడి ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, బ్యాచిలర్ లైఫ్‌ను ట్రెండీగా చూపిస్తూ హైదరాబాద్ స్లాంగ్ డైలాగ్‌లతో ఆకట్టుకుంటోంది. ఈ కామెడీ డైలాగ్‌లు యూత్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. మొత్తంగా ఇది ఫన్, ఫ్యామిలీ-ఫ్రెండ్లీ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తోంది. ఈ సినిమా ఈ వారమే ఓటీటీలోకి రాబోతోంది. ఈ స్టోరీ ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ కి రాబోతోంది ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
పరమేష్ హైదరాబాద్‌లో ఒక మిడిల్ క్లాస్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. బొల్లారంలో వామన్, పల్లి, సాయి, భార్గవ్ అనే నలుగురు స్నేహితులతో కలిసి హ్యాపీ జీవితం గడుపుతుంటాడు. అయితే అతనికి సొంత రెస్టారెంట్ స్టార్ట్ చేయాలనే కల ఉంటుంది. కానీ దానికి కావాల్సిన 50 లక్షల రూపాయలు సమకూర్చడం అతనికి సవాల్. అతని స్నేహితులలో ఫిల్మ్‌మేకర్ కావాలని కలలు కనే వామన్ తప్ప, మిగతావాళ్ళు ఎటువంటి లక్ష్యం లేకుండా పరమేష్ ఆదాయంపై ఆధారపడతారు. డబ్బు సంపాదించడానికి వీళ్ళు “బిందాస్ బ్యాచిలర్స్” అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, హాంటెడ్ ప్లేసెస్‌లో ఘోస్ట్-హంటింగ్ వీడియోలు షూట్ చేస్తారు.
ఒక హాంటెడ్ ప్యాలెస్‌లో షూటింగ్ సమయంలో, వీళ్ళకి ఒక తంత్ర శాస్త్ర పుస్తకం దొరుకుతుంది. డబ్బు సంపాదించే ఆశతో, వీళ్ళు ఆ పుస్తకంలోని రిచ్యువల్‌ను ప్రయత్నిస్తారు, కానీ అనుకోకుండా బకాసురుడు అనే తిండి రాక్షసుడి ఆత్మను మేల్కొల్పుతారు. ఈ ఆత్మ వారి ఇంట్లో ఆహారాన్ని మాయం చేస్తూ, వారి జీవితాల్లో గందరగోళం సృష్టిస్తుంది. ఆహారం అదృశ్యం కావడం, వింత సంఘటనలతో వాళ్ళు భయపడతారు. బకాసురుడి ఆత్మ ఎవరు ? దాని మోటివ్ ఏమిటి ? అది వారికి మిత్రమా శత్రువా ? అని తెలుసుకోవడానికి వీళ్ళంతా ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో వచ్చే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. మీరు కూడా ఫ్యామిలీతో కలసి నవ్వడానికి సిద్దంగా ఉండండి.
‘బకాసుర రెస్టారెంట్’ (Bakasura restaurant) ఎస్.జె. శివ దర్శకత్వంలో వచ్చిన తెలుగు కామెడీ హారర్ సినిమా. ఎస్.జె. మూవీస్ బ్యానర్‌పై లక్ష్మయ్య ఆచారి, జనార్ధన్ ఆచారి దీనిని నిర్మించారు. ఇందులో ప్రవీణ్, హర్ష చేముడు, గరుడ రామ్, కృష్ణ భగవాన్, శ్రీకాంత్ అయ్యంగార్, జబర్దస్త్ అప్పారావు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఆగస్టు 8న థియేటర్లలో విడుదలై, మిక్స్డ్ రివ్యూలు అందుకుంది. ఈ నెల 12 నుంచి Sun NXT లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. 2 గంటల 38 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 8.9/10 రేటింగ్ ని కూడా పొందింది.
Read Also : లాడ్జిలో అమ్మాయి హత్య… మంచానికి చేతులు కట్టేసి ఆ పాడు పని… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సిరీస్ మావా