Nani New Movie : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ప్రస్తుతం చాలామంది యంగ్ టాలెంటెడ్ దర్శకులు ఎంట్రీ ఇస్తున్నారు. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ కొట్టి తమన్ తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. దసరా సినిమాలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్ ఓదెల. నానికి దసరా కథని చెప్పినప్పుడు మొదట ఒక స్మాల్ బడ్జెట్ ఇచ్చి డెమో చేసుకొని రమ్మని చెప్పారు.
చాలా తక్కువ బడ్జెట్ తో డెమో చేసిన శ్రీకాంత్ నానిని ఆశ్చర్యపరిచాడు. అది కూడా ఒక పాత లాప్టాప్ లో ఆ డెమో సినిమాను చూపించాడు. ఇక దసరా సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నాని కెరియర్లో హైయెస్ట్ కలెక్షన్స్ వసూలు చేసిన సినిమా దసరా. అయితే మళ్లీ నాని హీరోగా ప్యారడైజ్ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు శ్రీకాంత్.
ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది అనే నాని ప్రతి ఇంటర్వ్యూలోను చెబుతూనే వచ్చాడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. అనిరుద్ ఇచ్చిన సంగీతం ఈ టీజర్ కి నెక్స్ట్ లెవెల్ ప్లస్ అయింది. ది ప్యారడైజ్ మూవీ కోసం హైదరాబాద్ శివారులో 30 ఎకరాల విస్తిర్ణంలో ఓ స్లమ్ సెట్‌ను వేస్తున్నారట. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. 30 ఎకరాల విస్తీర్ణంలో సెట్ అంటే ఏ స్థాయిలో ఉండబోతుందో అని అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది. ఈ సినిమాను మార్చి 2026 లో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగానే ప్రకటించారు.
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని చాలామంది దర్శకుడు అనుకుంటారు. కానీ ఆ అవకాశం కొంతమందికి మాత్రమే దక్కుతుంది. మరి కొంతమందికి దక్కినట్లు దక్కి దూరమైపోతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాథ్ లాంటి దర్శకులు మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకున్నారు. పూరి జగన్నాథ్ సినిమా అయితే రెండు మూడు సార్లు పూజ వరకు కూడా వెళ్లాయి. కానీ చివరి నిమిషంలో తప్పిపోయాయి. ఇక ప్యారడైజ్ సినిమా అయిపోయిన తర్వాత శ్రీకాంత్ ఏకంగా చిరంజీవిని డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమాను నాని ప్రొడ్యూస్ చేయనున్నారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా చాలామందికి క్యూరియాసిటీ పెంచింది. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు (Mana Shankara Varaprasad Garu) సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుక 2026 లో విడుదల కానుంది.
Also Read: Ram Pothineni: ప్రేమలో పడ్డాడు.. అప్పుడు రాశాడు… ఇప్పుడు పాడాడు