Ilayaraja: సంగీతానికి రాళ్లు కదులుతాయి అంటారు. ఆ మాట నిజం కూడా అని కొంతమంది ఒప్పుకుంటారు. వాస్తవానికి ఒక మనిషిని కదిలించగలిగే శక్తి సాహిత్యానికి సంగీతానికి ఉంటుంది. తెలుగు సినిమా సంగీతం విషయానికి వస్తే ఇళయరాజా కంపోజ్ చేసే పాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో అందరికీ తెలుసు.
డబ్బులు లేకుండా రిచ్ గాను, అమ్మాయిలు లేకుండా రొమాంటిక్ గాను ఒక మనిషిని ఉంచగలిగే శక్తి ఇళయరాజా సంగీతానికి ఉంది. ఇళయరాజా పాటలు ఎంత బాగుంటాయో, ఇళయరాజా వ్యక్తిత్వం దానికి ఆపోజిట్ గా ఉంటుంది. ఇళయరాజా పాటలను చాలామంది ఇష్టపడతారు. ఇప్పటికీ కూడా ఇళయరాజా సంగీతం వింటే మనసుకు హాయిగా అనిపిస్తుంది. కానీ చాలామందికి బాధ కలిగించే విషయం ఇళయరాజా కాపీరైట్స్ వేయడం.
తన పాటలను సినిమాలలో వాడుకుంటున్న అందుకు కాపీరైట్ వేసే హక్కు ఖచ్చితంగా సంగీత దర్శకుడుకు ఉంటుంది. దానిలో సందేహం లేదు. కొన్నిసార్లు పర్మిషన్ లేకుండా కొందరు విచ్చలవిడిగా ఆయన పాటలు వాడుతూ ఉంటారు. అటువంటి వాళ్లపైన చర్యలు తీసుకున్న పర్వాలేదు. కానీ ఇళయరాజా కంపోజ్ చేసిన పాటలకు అందాన్ని తీసుకొచ్చింది ఎస్పిబి.
ఎస్పీబీ గొంతులో ఒక పాట వింటే స్వర్గం అంచుల వరకు వెళ్లినట్లు ఉంటుంది. అటువంటి ఎస్పీబీ కూడా కొన్ని కన్సర్ట్ లో తన పాటలు పాడకూడదు అంటూ ఇళయరాజా నోటీసులు పంపించారు. అప్పుడే ఇళయరాజా మీద చాలామందికి విపరీతమైన నెగెటివిటీ పుట్టుకొచ్చింది.
అప్పటినుంచి తన సినిమా పాటలు ఎవరు వాడినా కూడా వాళ్లకు కాపీరైట్స్ పంపించడం అనేది ఇళయరాజా చేస్తుంటారు. రీసెంట్గా అజిత్ నటించిన గుడ్ బాడ్ అగ్లీ సినిమాలో కూడా తన పాటలను వాడినందుకు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కు ఐదు కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసులు పంపారు.
అయితే మైత్రి మూవీ మేకర్స్ మేము సరైన పర్మిషన్స్ తీసుకున్నాం అంటూ దానిపైన రియాక్ట్ అయ్యారు. అయితే ఇళయరాజా ఈ విషయంలో మద్రాసు హైకోర్టుకు ఎక్కారు. ఈ విషయంలో మద్రాస్ హైకోర్టు కూడా ఇళయరాజాతో ఏకీభవించింది.
నా అనుమతి తీసుకోకుండా నా పాటలను ఏ రూపంలోనూ ఉపయోగించుకునే హక్కు ఎవరికీ లేదు అని ఇళయరాజా మద్రాస్ హైకోర్టులో దాఖలు చేసిన కేసులో అన్నారు. కోర్టు అతనితో ఏకీభవించి గుడ్ బ్యాడ్ అగ్లీ ( Good Bad Ugly) ప్రదర్శన మరియు ప్రసారాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇళయరాజాకు మద్దతుగా నిలబడిన కూడా కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఇళయరాజాను ఈ ఏజ్ లో చాదస్తం ఎందుకు పాట ఇంకో పది మందికి చేరువవుతుంది కదా అనే ఉద్దేశంతో కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Bigg Boss Telugu season 9 : గుండు అంకుల్ అనకు, ఇమ్మాన్యులకు మాస్క్ మ్యాన్ హరీష్ స్ట్రాంగ్ వార్నింగ్