Bigg Boss Telugu season 9 : తెలుగు బిగ్ బాస్ షో మొదలైపోయింది. ఎప్పుడు ఎప్పుడు అని ఎదురుచూసిన టైం వచ్చేసింది. ప్రస్తుతం ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు సక్సెస్ఫుల్ గా తొమ్మిదో సీజన్ లోకి అడుగు పెట్టింది. మొత్తానికి తొమ్మిదో సీజన్ మాత్రం ఎనిమిది సీజన్ల ను మించి ఉంది. చాలా ఆసక్తికరంగా ఊహకు అందని రకంగా ఈ తొమ్మిదవ సీజన్ ను ప్లాన్ చేశారు.
మొత్తానికి మెల్లమెల్లగా అందరి ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటకు రావడం మొదలవుతుంది. కొద్దిసేపటి క్రితం నేడు రాత్రి 9 గంటల 30 నిమిషాలకు ప్రసారం అవ్వబోయే బిగ్బాస్ ఎపిసోడ్ ప్రోమో కొద్దిసేపటికి విడుదలైంది. ఈ ప్రోమో ఇప్పుడు క్షణాల్లో వైరల్ గా మారుతుంది. ఎందుకు ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.
మొత్తం బిగ్ బాస్ షోలో 14 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. వీళ్లలో మాస్క్ మెన్ హరీష్ ఒకరు. మాస్క్ మెన్ ఎంట్రీ ఇచ్చిన హరీష్ చాలామంది దృష్టిని ఆకర్షించాడు. అయితే మాస్క్ మెన్ కొంచెం లావుగా ఉండి గుండు చేసుకుని ఉంటాడు. అయితే ఇమ్మానుయేల్ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హరీష్ ని పిలుస్తూ గుండు అంకుల్ అన్నాడు.
వెంటనే హరీష్ బాడీ సేమింగ్ చేయకు. లిమిట్స్ క్రాస్ చేయొద్దు అంటూ మాటకు మాట దిగారు. వీళ్ళిద్దరిని భరణి వచ్చి ఆపే పరిస్థితి వరకు వీళ్ళ ఆర్గుమెంట్ వెళ్ళిపోయింది. ఇక ప్రస్తుతం ఈ ప్రోమో మంచి ఆసక్తిని కలిగిస్తుంది. ఎపిసోడ్ మీద క్యూరియాసిటీ మొదలవుతుంది.