Jobs in Indian Railways: ఎన్నో రోజుల నుంచి రైల్యే పరీక్షలకు సన్నద్దమవుతున్నారా..? ఇప్పుడు ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు శుభవార్త. ఎన్నో రోజుల నుంచి ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్న గ్రూప్-డి పరీక్ష తేదీలు వచ్చేశాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 32,438 వేల గ్రూప్-డి ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే.
ఎగ్జామ్ డేట్స్..
గ్రూప్ -డీ ఎగ్జామ్స్ నవంబర్ 17 నుంచి డిసెంబర్ నెలాఖరు వరకు నిర్వహించనున్నట్టు రైల్వే బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. ఆన్ లైన్ విధానంలో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. ఎగ్జామ్ కు పది రోజుల ముందు ఎగ్జామ్ సెంటర్, డేట్ వంటి వివరాలు అందుబాటులో ఉంటాయని వివరించింది. గ్రూప్ డీ అభ్యర్థులు అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అఫీషియల్ వెబ్ సైట్ ను ఫాల్లో కావాలని తెలిపింది.
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో గ్రూప్–డి పోస్టుల భర్తీకి నోటిఫికేష్ వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అవ్వండి. ఇలాంటి అవకాశం రావడానికి మళ్లీ చాలా సమయం పడొచ్చు.. కనుక ఈ సారే జాబ్ కి అప్లై చేసుకొని కాస్త కష్టపడి చదివితే ఉద్యోగం వస్తుంది. మరెందుకు ఆలస్యం వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 32,438
నోట్: మన సికింద్రాబాద్ జోన్ లో 1642 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
ఇందులో వివిధ రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పాయింట్స్ మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకోషెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
ట్రాఫిక్, ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు వెకన్సీ ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు టెన్త్ క్లాస్, సంబంధిత విభాగంలో ఐటీఐ పాసై ఉండాలి. నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు కల్గి ఉండాలి. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్ అభ్యర్థులకు వయస్సు సడలింపు ఉంది. దరఖాస్తు ప్రారంభ తేది 2025 జనవరి 23. దరఖాస్తు ముగింపు తేది: 2025 ఫిబ్రవరి 22 తో ముగిసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 32,438 ఉద్యోగాలకు నోటిఫికేషణ్ విడుదల అయ్యింది.
ALSO READ: BHEL: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.65వేల జీతం, ఇంకా నాలుగు రోజులే ఛాన్స్
ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పటి నుంచి ప్రణాళిక ప్రకారం చదువుకుంటే గ్రూప్-డి ఉద్యోగాన్ని ఈజీగా సాధించవచ్చు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలు బాగా రాయలేని వారికి ఇది గోల్డెన్ అపార్చునిటీగా చెప్పవచ్చు. మళ్లీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియని పరిస్థితి. సో ఇప్పుడే ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకుండి. ఆలస్యం చేయకుండా ప్రిపరేషన్ మొదలు పెట్టండి.