BigTV English

Indian Train In Africa: ఆఫ్రికాలో మేడ్ ఇన్ ఇండియా రైళ్లు.. అచ్చం వందేభారత్‌ లాగే ఉన్నాయిగా!

Indian Train In Africa: ఆఫ్రికాలో మేడ్ ఇన్ ఇండియా రైళ్లు.. అచ్చం వందేభారత్‌ లాగే ఉన్నాయిగా!

Made In India Trains:

గత దశాబ్ద కాలంలో భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోంది. ఒకప్పుడు ఇండియాకు ఏ వస్తువులు కావాలన్నా దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా మేడ్ ఇన్ ఇండియా రైళ్లను సైతం ఎగుమతి చేసే స్థాయికి చేరింది. లోకోమెటివ్ లు, రైలు కోచ్ లతో పాటు రైల్వే సంబంధ ఇతర పరికరాలను ఎక్స్ పోర్ట్ చేస్తున్నది. ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో ఇప్పుడు భారత్ లో తయారైన అత్యాధునిక రైళ్లు పరుగులు తీస్తున్నాయి. మొజాంబిక్ దేశంలో వందేభారత్ రైళ్ల మాదిరి మేడ్ ఇండియా రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడిప్పుడే వారికి మెరుగైన రైల్వే రవాణా సౌకర్యాన్ని అందిస్తున్నాయి.


మొజాంబిక్ తో కీలక రైల్వే ఒప్పందాలు

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రక్షణ,  రైల్వే రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తోంది భారత ప్రభుత్వం. అత్యాధునిక వందేభారత్ రైళ్లను ఈ పథకంలో భాగంగానే తయారు చేస్తున్నారు. ఇలాంటి రైళ్లనే తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోంది. ఇప్పటికే ఈ రైళ్లను ఆఫ్రికన్ కంట్రీ మోజాంబిక్ భారతీయ రైళ్లను ఉపయోగిస్తోంది. భారత్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న మొజాంబిక్.. రైల్వే రంగానికి సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాల ఖరీదు సుమారు రూ. 1,000 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో భాగంగా 10 అత్యాధునిక వందేభారత్ రైళ్ల మాదిరి ట్రైన్స్ ను సరఫరా చేసింది. ప్రస్తుతం అక్కడ ఈ రైళ్లు తమ సేవలను అందిస్తున్నాయి. ఇప్పటికే ఆ దేశానికి ఆర్థికసాయంతో పాటు సాంకేతిక సహకారాన్ని అందిస్తోంది.

2019లో పలు రైళ్లు అందజేత

2019లో లో భారత్ మోజాంబిక్ కు రైల్వే కోచ్ లతో పాటు లోకోమోటివ్ లను సరఫరా చేసింది. ఈ రైళ్లు అన్నీఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)తో పాటు రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) తయారు చేసింది.  ఈ రైళ్లు మొజాంబిక్‌ లోని రైల్వే లైన్లలో, ముఖ్యంగా నాకాలా-టెట్ రైల్వే కారిడార్‌ లో  ఉపయోగిస్తున్నారు. ఈ ప్రాంతంలో ప్రజా రవాణాతో పాటు ఖనిజాల రవాణాకు ఈ రైళ్లను ఉపయోగిస్తున్నారు. కొద్ది నెలల క్రితం ఆఫ్రికా దేశాల పర్యటనకు వెళ్లి విదేశాంగమంత్రి జైశంకర్ ఉగాండా, మోజాంబిక్ లో పర్యటించారు. ఈ సందర్భంగా మోజాంబిక్ లో మేడ్ ఇన్ ఇండియా రైలులో ప్రయాణించారు. తాజాగా మొజాంబిక్ లో మేడ్ ఇండియా రైలు ప్రయాణాన్ని ప్రపంచ యాత్రికుడు అన్వేష్ చూపించాడు. అత్యాధునిక రైళ్లు అక్కడి ప్రజలకు ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తున్నట్లు చూపించాడు. ఇప్పుడిప్పుడే పట్టాలు ఎక్కిన ఈ రైళ్లు ప్రస్తుతం సుమారు 40 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు చెప్పాడు. కొద్ది రోజుల్లోనే వీటి వేగం పెరిగే అవకాశం ఉందన్నారు. అటు మొజాంబిక్ లో మహీంద్రా తయారు చేసిన ట్రక్కులను కూడా విరివిగా ఉపయోగిస్తున్నట్లు తన వీడియోలో చూపించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


Read Also: ఆ విమానంలోని సీట్ల నిండా బంగాళ దుంపల బస్తాలు వేశారు.. ఎందుకో తెలుసా?

Related News

Indian Railways: రైల్వే టికెట్లపై వీరికి 100 శాతం డిస్కౌంట్, కారణం ఏంటంటే?

Potatoes in Plane: ఆ విమానంలోని సీట్ల నిండా బంగాళ దుంపల బస్తాలు వేశారు.. ఎందుకో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో చాలా స్పీడ్.. పాతబస్తీ కల నెరవేరే సమయం దగ్గరలోనే!

AP metro rail tenders: విశాఖ, విజయవాడ మెట్రో రైల్.. తాజా పరిస్థితి ఏంటి? అసలేం జరుగుతోంది?

IRCTC Vietnam Tour: IRCTC వింటర్ వియత్నాం టూర్, 8 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి!

Big Stories

×