Allu Arjun: కొంతమంది సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకపోయినా కూడా వాళ్లకు ఉన్న క్రేజ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అలానే చాలామంది స్టార్ హీరోల వారసుల ఎంట్రీ కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నేనొక్కడినే సినిమాతో ఎంట్రీ ఇచ్చేసాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు కానీ గౌతమ్ నటిస్తున్నాడు అన్నప్పుడు చాలామందికి విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది. గౌతమ్ పర్ఫామెన్స్ చూసి కూడా ఆడియన్స్ సప్రైజ్ అయ్యారు.
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అఖీరా (Akira Nandan) ఎంట్రీ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. గతంలో రేణు దేశాయ్ (Renu Desai) దర్శకత్వం వహించిన ఒక బాలీవుడ్ సినిమాలో కనిపించాడు అఖీరా. కానీ హీరోగా మాత్రం పూర్తి స్థాయి సినిమా ఇప్పటివరకు చేయలేదు. కానీ తనకు విపరీతమైన క్రేజ్ ఉంది అని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలు రీ రిలీజ్ అయినప్పుడు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ నటించిన చాలా సినిమాలను ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్యా థియేటర్ (Sandhya theatre) కి చూడడానికి వస్తుంటాడు అఖీరా. తన ఫోటోలు కూడా ఆ టైంలో వైరల్ అవుతుంటాయి.
అఖీరా ను షాక్ అయిన బన్నీ
అఖీరా ఎంత హైట్ ఉంటాడో అందరికీ తెలిసిన విషయమే. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా మా కుటుంబంలో అందరికంటే హైట్ అంటూ ట్వీట్ కూడా పెట్టారు. ఇకపోతే చాలా కుటుంబ ఫంక్షన్స్ లో దర్శనమిస్తుంటాడు అఖీరా. కొన్ని రోజుల క్రితం అల్లు అరవింద్ అమ్మ అల్లు కనక రత్నమ్మ మరణించిన సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అంతా ఒకచోట అప్పుడు కనిపించారు. ఆ సందర్భం అలాంటిది కాకపోయినా కూడా, అందరినీ ఒకచోట చూడటం అనేది చాలామందికి కొద్దిపాటి ఆనందం కలిగించింది. ఆ తరుణంలో సోషల్ మీడియాలో చాలా పోస్టులు కూడా వచ్చాయి.
ఇక ప్రస్తుతం మళ్ళీ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అల్లు అర్జున్ అందరూ కలిసి ఒకే చోట చేరారు. అల్లు కనక రత్నమ్మ గారికి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా నివాళులర్పిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ తో పాటు అఖీరా కూడా దర్శనమిచ్చాడు. అఖీరా చూసి అల్లు అర్జున్ షాక్ అయిపోయాడు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏంట్రా ఇంత పొడుగు ఉన్నావ్ అని ఆశ్చర్యపడిపోయేలా ఆ వీడియోలో కనిపిస్తున్నాడు బన్నీ.
Also Read : Nani New Movie : 30 ఎకరాల స్లమ్‌లో నాని కష్టాలు… ఆ డైరెక్టర్ అసలేం చేస్తున్నాడో