Karimnagar News: కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని దీపిక ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన ఓ యువతిని ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఓ యువతి టైఫాయిడ్ ఫీవర్ తో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని దీపిక ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యింది. దీక్షిత్ అనే టెక్నీషియన్ ఆమెకు మత్తు మందు ఇచ్చి యువతి అపస్మారక స్థితిలో లైంగిక దాడి చేశాడని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దాడి తర్వాత బాధితురాలు అపస్మారకంగా ఉండటంతో.. కుటుంబ సభ్యులకు డౌట్ వచ్చి వేరే ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి, లైంగిక దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ జరిగింది.
ఘటన తెలిసిన వెంటనే.. బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ టౌన్-3 పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సీజ్ చేసి, సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు. బాధితురాలి మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి, ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) రిపోర్ట్ చూసి పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు.
ALSO READ: BHEL: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.65వేల జీతం, ఇంకా నాలుగు రోజులే ఛాన్స్
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ అలమ్ మాట్లాడుతూ.. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ లో యువతిపై లైంగిక దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటన ప్రైవేట్ ఆస్పత్రుల్లో రోగుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. మహిళలు, ముఖ్యంగా రోగులు ఆస్పత్రుల్లో ఎదుర్కొనే ప్రమాదాలపై చర్చలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగినప్పటికీ.. మరో సారి సంఘటన జరగడంతో జిల్లాలో ఆందోళన కలిగించింది.
ALSO READ: Nuzvid IIIT: దారుణం.. ఎగ్జామ్ రాయనివ్వలేదని ప్రొఫెసర్‌పై కత్తితో దాడి.. చివరకు?
పోలీసులు నిందితుడు దిక్షిత్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆస్పత్రి యాజమాన్యం పై కూడా విచారణ జరుగుతోంది. రోగుల భద్రత కోసం ఆస్పత్రుల్లో మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా మహిళల భద్రతపై మరోసారి చర్చలు తెరపైకి తెచ్చింది.