Mega Hero’s In One Frame: మెగా ఫ్యాన్స్కి సర్ప్రైజ్. ఒకే ఫ్రేంలో మెగా హీరోలు కనిపించి ఫ్యాన్స్ని కనువిందు చేశారు. అల్లు అరవింద్ తల్లి కనకరత్నమ్మ పద్దకర్మ సందర్భంగా.. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పక్కక్కనే కనిపించడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకున్నారు. కాగా గత కొంతకాలంగా మెగా–అల్లు ఫ్యామిలీ మధ్య మనస్పర్థలు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి సపోర్టు ఇవ్వడంతో రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగింది. అంతకు ముందు ఒకే కుటుంబంలా ఉన్న అల్లు–మెగా ఫ్యామిలీల మధ్య అనుబంధం కరువైంది. బావ–బామ్మర్ది అంటూ ఎంతో సన్నిహితంగా ఉన్న చరణ్, బన్నీ కనీసం బర్త్డేలకు కూడా విష్ చేసుకోలేదు.
ఎవరి సినిమా అయినా ఈ ఇద్దరు ఒకరికి ఒకరు సపోర్టు ఇచ్చుకుంటు ఈవెంట్స్కి హాజరయ్యేవారు. కానీ, రెండేళ్లుగా ఎడమోహం పెడమోహంగా ఉంటున్నారు. మూవీ రిలీజ్కి కూడా విష్ చేసుకోవడం లేదు. ఇక రెండు కుటుంబాలు శాశ్వతంగా దూరమయ్యాయా అని అనుకుంటున్న సమయంలో.. అల్లు అర్జున్ అరెస్ట్ కాస్తా దూరం తగ్గించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ చిరు, నాగబాబు ఇంటికి వెళ్లి మరి కలిశాడు. కానీ, పవన్ కళ్యాణ్‌తో మాత్రం దూరంగా ఉన్నాడు. అరెస్ట్ తర్వాత కనీసం పలకరించలేదు కూడా. ఆ తర్వాత ఇక కలిసిపోతాయనుకున్న రెండు కుటుంబాలు దూరంగా ఉంటూనే వచ్చాయి. ఇక ఈ మనస్పర్థలకు ఎప్పుడు తెర పడుతుందా? ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో నిర్మాత అల్లు అర్జున్ తల్లి కనకరత్నమ్మ మరణంతో ఈ రెండు కుటుంబాలు దగ్గరయ్యాయి. ఆమె మ్రతితో ఇరు కుటుంబాలు కలిశాయి.
సినీ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ దశదినకర్మలో పాల్గొని నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
#alluaravind #Pawankalyan #AlluKanakaratnam #AlluArjun #RamCharan #AkiraNandan pic.twitter.com/X9Q3kMye7l
— BIG TV Cinema (@BigtvCinema) September 8, 2025
కష్టసమయాల్లో ఒకరికి ఒకరు తోడుగా నిలబడ్డారు. చివరికి పవన్ కళ్యాణ్ సైతం అల్లు అరవింద్ ఇంటికి వచ్చారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ పరామర్శించాడు. ఇక పవన్ రాకతో అల్లు–మెగా ఫ్యామిలీ మధ్య ఉన్న మనస్పర్థలు పూర్తి తొలిగిపోయి మళ్లీ ఒక్కటయ్యాయి. ఈ రోజు కనకరత్నమ్మా పెద్ద కర్మ సందర్భంగా రెండు కుటుంబాలు ఒక దగ్గర కనిపించి.. అభిమానులను కనువిందు చేశారు. ముఖ్యంగా పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లు కలిసి మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. ఈ ముగ్గురు హీరోలు పక్కపక్కనే చూసి మెగా ఫ్యాన్స్కి కనుల పండుగగా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని ఫ్యాన్స్ షేర్ చేస్తూ తెగ మురిసిపోతున్నారు. ఎట్టకేలకు మా హీరోలు కలిసిపోయారని, మెగా హీరోలని ఒకే ఫ్రేం చూస్తుంటే.. పండగలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎట్టకేలకు మా హీరోలు ఒక్కటయ్యారు.. ఇక మామూలుగా ఉండదంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Divvela Madhuri: దివ్వెల మాధురి ఎక్కడ? పెళ్లి కోసమే బిగ్ బాస్ ఎంట్రీ ఆలస్యం? ఆమె ఏం చెప్పిందంటే?