Nandamuri Balakrishna : సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నారు. వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంటున్నారు. దాదాపు బాలకృష్ణ సినిమాలు పని అయిపోయింది అనుకున్న తరుణంలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ అద్భుతమైన సక్సెస్ సాధించింది.
అలానే ఆహా ప్లాట్ ఫామ్ లో వచ్చే అన్స్టాపుల్ షో కూడా బాలకృష్ణకు విపరీతమైన పాజిటివిటీ ను తీసుకొచ్చింది. చాలామంది యంగ్ హీరోలు సైతం బాలకృష్ణని ఇష్టపడటం మొదలుపెట్టారు. చాలామంది హీరోలతో బాలకృష్ణ ఎంత క్లోజ్ గా ఉంటారో అని అప్పుడే చాలామందికి ఐడియా వచ్చింది.
రీసెంట్ గా సినీ ప్రయాణంలో బాలకృష్ణ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఒక హీరో దిగ్విజయంగా ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది ఒక అరుదైన ఘనత అని చెప్పాలి. ఇప్పుడు బాలయ్య మరో రికార్డును కూడా అచీవ్ చేశారు. ముంబయిలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) బెల్ మోగించిన ఫస్ట్ సౌత్ ఇండియన్ స్టార్ గా నిలిచారు.
ఆ బెల్ మోగించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రీసెంట్ గా ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు దక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఒక సరికొత్త రికార్డు బాలయ్య ఖాతాలోకి చేరినందుకు అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Nani New Movie : 30 ఎకరాల స్లమ్‌లో నాని కష్టాలు… ఆ డైరెక్టర్ అసలేం చేస్తున్నాడో