Asia Cup 2025 : ఆసియా కప్ 2025 (Asia Cup2025) సెప్టెంబర్ 09 నుంచి ప్రారంభం అవ్వనున్న విషయం తెలిసిందే. ప్రారంభం కావడానికి మరికొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. అబుదాబీ వేదికగా మంగళవారం అప్గానిస్తాన్ వర్సెస్ హాంకాగ్ మ్యాచ్ లో ఆసియా కప్ (Asia Cup) మ్యాచ్ ప్రారంభం అవుతుంది. రేపు రాత్రి 8.00 గంటలకు ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 10న భారత్ వస్సెస్ యూఏఈ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. అలాగే సెప్టెంబర్ 14న పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా (PAK Vs IND) మధ్య హోరా హోరీ పోరు జరుగనుంది. మరోవైపు ఆసియా కప్ (Asia Cup) లో జరిగిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఈ టోర్నీలో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు భారత వన్డే కెప్టెన్, లెంజరీ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohith Sharma) పేరిటే ఉంది.
Also Read : MS Dhoni : ధోని వింటేజ్ కారు చూశారా.. దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఆసియా కప్ (Asia Cup) లో అత్యధిక సిక్స్ లు కొట్టిన వారిని ఒక్కసారి పరిశీలించినట్టయితే.. ఆసియా కప్ (Asia Cup) లో రోహిత్ శర్మ (Rohith Sharma) మొత్తం 37 మ్యాచ్ లు ఆడాడు. అయితే ఈ సమయంలో అతను 40 సిక్సర్లు కొట్టిన ఘనతను సాధించాడు. రోహిత్ వన్డేలలో 28, టీ-20ల్లో 12 సిక్స్లు బాదాడు. రోహిత్ శర్మ (Rohith Sharma) తరువాత షాహిద్ అఫ్రిది 26 సిక్స్ లు, సనత్ జయసూర్య 23, సురేష్ రైనా 18, మొహమ్మద్ నబీ 13, సౌరబ్ గంగూలీ 13, ఇంజామామ్ ఉల్ హక్ 12, వీరేంద్ర సెహ్వాగ్ 12, ధోనీ 12, ముష్పికర్ రహీమ్ 11 సిక్స్ లు బాదారు. అయితే వీరిలో టీమిండియా కి చెందిన ఆటగాళ్లే ఎక్కువ కొట్టారు. కేవలం టీ 20ల్లో రోహిత్ శర్మ 9 మ్యాచ్ ల్లో 12 సిక్స్ లు బాదగా.. విరాట్ కోహ్లీ 10 మ్యాచ్ ల్లో 11 సిక్స్ లు, సూర్యకుమార్ 5 మ్యాచ్ ల్లో 8 సిక్సులు, కే.ఎల్. రాహుల్ (K.L.Rahul) 5 మ్యాచ్ ల్లో 6 సిక్స్ లు, ధోనీ 5 మ్యాచ్ ల్లో 4 సిక్స్ లు బాదారు. టీమిండియా ఆటగాళ్లు ఐదుగురు సిక్స్ లు కొట్టిన రికార్డుల్లో ఉండటం విశేషం. మరోవైపు ఆసియా కప్ టీ 20 చరిత్రలో హాంకాంగ్ జట్టు బ్యాట్స్ మన్ బాబర్ హయత్ ( Babar Hayat) తన అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఒకే ఇన్నింగ్స్ లో ఏకంగా 7 సిక్సులు కొట్టి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డును ఎవ్వరూ బ్రేక్ (BreaK) చేయలేకపోవడం విశేషం.
ఇప్పటివరకు టీమిండియా (Team India) ఆసియా కప్ (Asia Cup) ను 8 సార్లు గెలుచుకొని నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. టీమిండియా (Team India) తరువాత శ్రీలంక (Srilanka) జట్టు 6 సార్లు, పాకిస్తాన్ జట్టు 2 సార్లు గెలుచుకుంది. టీమిండియా విషయానికి వస్తే.. తొలిసారిగా 1984లో ఆసియా కప్ గెలుచుకుంది. ఇక ఆ తరువాత 1988, 1990, 1995, 2010, 2016, 2018, 2023 మొత్తం టీమిండియా (Team India) 8 సార్లు ఆసియా కప్ విజయం సాధించింది. శ్రీలంక విషయానికి వస్తే.. 1986, 1987, 2004, 2008, 2014, 2022లో మొత్తం శ్రీలంక జట్టు 6 సార్లు ఆసియా కప్ (Asia Cup) కొట్టింది. పాకిస్తాన్ (Pakistan) జట్టు 2000, 2012లో ఆసియా కప్ గెలుచుకుంది. ఇప్పుడు ఈ సారి ఎవ్వరూ గెలుస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారనుంది. ఇక ఆసియా కప్ (Asia Cup) లో టీమిండియా (Team India) ఆటగాళ్లు పలు రికార్డులను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. అర్ష్ దీప్ సింగ్ 1 వికెట్ తీస్తే.. 100 వికెట్లు పూర్తి చేసుకున్న ఆటగాడిగా, మరోవైపు హార్దిక్ పాండ్య (Hardik Pandya) 17 పరుగులు చేస్తే.. మరో అరుదైన రికార్డు (Record) ను సాధించే అవకాశం కనిపిస్తోంది.