BigTV English

OTT Movie : ఈ అమ్మాయిని ప్రేమిస్తే కుక్క చావే… మగవాళ్ళను దగ్గరకు రానివ్వని దెయ్యం… గుండె గుభేల్మనిపించే హర్రర్ మూవీ

OTT Movie : ఈ అమ్మాయిని ప్రేమిస్తే కుక్క చావే… మగవాళ్ళను దగ్గరకు రానివ్వని దెయ్యం… గుండె గుభేల్మనిపించే హర్రర్ మూవీ

OTT Movie : ఫాంటసీ సినిమాలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. కొన్ని సినిమాలైతే మరచిపోలేని అనుభూతిని ఇస్తాయి. అలాంటి డిఫరెంట్ స్టోరీ ఉన్న ఒక సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ లో ఉంది. ఈ సినిమాలో ఒక అమ్మాయి ఒంటరి జీవితం నుంచి బయటపడేందు ప్రేమలో పడాలనుకుంటుంది. అయితే ఆమె ప్రేమికులను ఒక ఆత్మ చంపుతూ అడ్డుతగులుతుంటుంది. ఈ సినిమా అంతర్జాతీయ ఫెస్టివల్స్‌లో చాలా అవార్డులు గెలుచుకుంది. ఫాంటాస్పోర్టో ఫిల్మ్ ఫెస్టివల్‌లో బెస్ట్ ఫిల్మ్ అవార్డు, సియాటిల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గ్రాండ్ జూరీ ప్రైజ్, మెలియెస్ డి’ఓర్ అవార్డ్‌కు నామినేషన్ గెలుచుకుంది. మరి ఇన్ని అవార్డులు గెలుచుకున్న సినిమాపై మనం కూడా ఓ లుక్ వేద్దామా. అయితే ముందుగా ఈ స్టోరీ ఏమిటి ? పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళ్తే

లిజా అనే 30 ఏళ్ల నర్స్, అనారోగ్యంతో ఉన్న మార్తాని అనే మహిళను 12 సంవత్సరాలుగా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. లిజా ఒంటరితనంతో జీవిస్తూ, జపాన్ రొమాంటిక్ నవలలు చదవడం, 1950ల జపాన్ పాప్ సంగీతం వినడం, ప్రేమ కోసం కలలు కనడం ఆమె రోజువారీ జీవితంలో భాగమవుతాయి. ఆమెకు ఉన్న ఏకైక తోడు టొమీ. ఇతను1950లో జపాన్ పాప్ స్టార్. కానీ చనిపోయి ఇప్పుడు ఆత్మ రూపంలో ఉంటాడు. లిజాతో డాన్స్ చేస్తూ, పాటలు పాడుతూ ఆమెను ఉత్సాహపరుస్తాడు. టొమీ ఆమె ఊహలోని స్నేహితుడిగా కనిపిస్తాడు.

లిజా తన 30వ పుట్టినరోజు సందర్భంగా, తన ఒంటరితనం నుండి బయటపడి. ప్రేమలో పడాలని నిర్ణయించుకుంటుంది. ఆమె ఒక ఫాస్ట్-ఫుడ్ రెస్టారెంట్ కి వెళ్తుంది. అక్కడ ఆమె ప్రేమ కోసం వెతకడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో లిజా ఇంటి వద్ద లేనప్పుడు, ఈర్ష్యతో మార్తాను టొమీ హత్య చేస్తాడు. మార్తా మరణం తర్వాత, ఆమె ఫ్లాట్ లిజాకు వారసత్వంగా వస్తుంది. ఇది మార్తా కుటుంబానికి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. వాళ్ళు హత్య అనుమానంతో, లిజాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తారు.


పోలీసు సర్జెంట్ జోల్టాన్ కేసును విచారించడానికి లిజా ఫ్లాట్‌లో రూమ్‌మేట్‌గా చేరతాడు. ఆమెను గమనిస్తూ ఆధారాలు సేకరిస్తాడు. అదే సమయంలో, లిజా డేటింగ్ ప్రయత్నాలు మొదలెడుతుంది. ఆమె కారోలీ, మిస్టర్ లుడ్విగ్ వంటి పురుషులతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆమెపై ఇంట్రెస్ట్ చూపించిన ప్రతి పురుషుడు అకస్మాత్తుగా భయంకరమైన మరణాలకు గురవుతుంటాడు.ఈ సంఘటనలు లిజాను భయాందోళనకు గురిచేస్తాయి. ఆమె తన జీవితంలో జరుగుతున్న విచిత్ర సంఘటనలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది.

లిజా తన జపాన్ రొమాంటిక్ నవలల ప్రభావంతో, ఒక అతీంద్రియ జీవి ప్రేమ వలన, తాను ప్రేమిస్తున్న వాళ్ళు చనిపోతున్నారని నమ్ముతుంది. ఆమె ఈ శాపం కారణంగా ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. అయితే కథ పురోగమిస్తున్న కొద్దీ, ఈ మరణాల వెనుక టొమీ ఈర్ష్య ఉందని తెలుస్తుంది. టొమీ, లిజా తనతోనే ఉండాలని కోరుకుంటాడు. ఆమె ఇతరులతో ప్రేమలో పడకుండా ఈ హత్యలను చేస్తుంటాడు.

జోల్టాన్, లిజాతో సమయం గడుపుతూ ఆమెపై నిజమైన ప్రేమను పెంచుకుంటాడు. అయితే టొమీ ఈర్ష్య కారణంగా జోల్టాన్ కూడా ప్రమాదంలో పడతాడు. ఇక క్లైమాక్స్ ఊహించని మలుపులు తీసుకుంటుంది. లిజాకి టొమీ నిజ స్వరూపం తెలుస్తుందా ? లిజాకి ప్రేమ దొరుకుతుందా ? ఒంటరిగానే ఉంటుందా ? టొమీని లిజా ఎలా ఎదుర్కొంటుంది ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే ప్రశ్నలకు ఈ సినిమాని చూసి సమాధానాలను తెలుసుకోండి.

ఏ ఓటీటీలో ఉందంటే

‘లిజా, ది ఫాక్స్-ఫెరీ’ (Liza the fox fairy) కారోలీ ఉజ్ మెజారోస్ దర్శకత్వంలో వచ్చిన హంగేరియన్ ఫాంటసీ రొమాంటిక్ సినిమా. ఇందులో మోనికా బాల్సాయ్, స్జాబోల్స్ బెడె-ఫాజెకాస్, డేవిడ్ సకురాయి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్/బై చేసుకోవచ్చు, రోకు చానల్‌లో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. ట్యూబీ టీవీలో కూడా ఉచిత ఆప్షన్ ఉంది. ఈ సినిమా హంగేరియన్ భాషలో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ అందుబాటులో ఉంది. 1 గంట 34 నిమిషాల రన్‌టైమ్ తో IMDbలో 7.5/10 రేటింగ్ పొందింది.

Read Also : వేరే వ్యక్తి భార్యను ఇంటికి తీసుకొచ్చి… మైండ్ బెండయ్యే ట్విస్టులు… మస్ట్ వాచ్ బెంగాలీ రొమాంటిక్ డ్రామా

Related News

OTT Movie : స్టార్ హీరోలెవ్వరూ చేయని సాహసాలు… హర్రర్ నుంచి సస్పెన్స్ దాకా మమ్ముట్టి కెరీర్ బెస్ట్ మూవీస్ ఇవే

OTT Movie : ఆడవాళ్లందరినీ వదిలేసి బొమ్మతో… చివరికి ఆ పని కూడా దాంతోనే… ఊహించని ట్విస్టులున్న థ్రిల్లర్ మూవీ

OTT Movie : క్షుద్ర పూజలతో మేల్కొలుపు… అంతులేని ఆకలున్న దెయ్యం ఇది… కామెడీతో కితకితలు పెట్టే తెలుగు హర్రర్ మూవీ

Chiranjeevi : భారీ ధరకు అమ్ముడుపోయిన మెగా 157 ఓటీటీ హక్కులు.. అక్కడే స్ట్రీమింగ్!

Telugu Web Series: ప్రేమలో తొందరపాటు.. ప్రియుడిని ముక్కలు చేసి డ్రమ్ములో వేసే ప్రియురాలు, కొత్త సీరిస్ సిద్ధం

Big Stories

×