Jubilee Hills polling: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ ఉదయం నుంచి మందకొడిగా సాగుతోంది. ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో అడుగడుగునా అధికార కాంగ్రెస్-బీఆర్ఎస్-బీజేపీ కార్యకర్తలు మొహరించారు. ఈ క్రమంలో కాంగ్రెస్- బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య రచ్చ మొదలైంది. ఈ విషయం తెలియగానే పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఇంతకీ అక్కడ ఏం జరిగింది?
బోరబండలో కాంగ్రెస్-బీఆర్ఎస్ కార్యకర్తల చర్చ
బోరబండలో బీఆర్ఎస్ vs కాంగ్రెస్ కార్యకర్తల మధ్య చిన్నపాటి ఫైటింగ్ సాగింది. బోరబండ కార్పొరేటర్‌పై బీఆర్ఎస్ కార్యకర్త చేయి చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ డివిజన్ నాయకులను పోలింగ్ బూత్‌ల వద్దకు అనుమతిస్తున్నారంటూ గొడవ పెట్టుకున్నారు కాంగ్రెస్ పార్టీ షేక్‌పేట డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ. ఈ క్రమంలో ఆయన పోలీసులతో వాగ్వాదం దిగారు.
అదే సమయంలో అటు బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి గమనించిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. మరోవైపు ఈ విషయం తెలియగానే బోరబండ పోలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత చేరుకున్నారు. బూత్‌లో ఏర్పాట్లు సరిగా చేయలేదని ఆమె ఆరోపించారు.
బీఆర్ఎస్ అభ్యర్థి సీరియస్.. ఎన్నికల అధికారి పర్యటన
ఈ విషయంలో ఎన్నికల అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ వ్యాఖ్యానించారు. లోపలికి వెళ్లడానికి తనకే ఇబ్బందిగా ఉందన్నారు. ఓటు వినియోగించుకునేందుకు వచ్చిన ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడం కరెక్టు కాదన్నారు.
మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించారు ఎన్నికల అధికారి కర్ణన్. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని అన్నారు. నియోజకవర్గంలోని ఆరు పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎం సమస్యలు తలెత్తాయని, త్వరితగతిన పరిష్కరించామని వెల్లడించారు. అలాగే డ్రోన్ పనితీరును ఆయన దగ్గరుండి మరీ పరిశీలించారు. తెలంగాణ ఎన్నికల చరిత్రలో తొలిసారి డ్రోన్లను వినియోగించారు.
ALSO READ: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న అభ్యర్థులు
139 పోలింగ్ సెంటర్లలో 139 డ్రోన్లు వినియోగించారు అధికారులు. ప్రతి డ్రోన్ నుంచి వచ్చే లైవ్ ఫీడ్‌ను కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తున్నారు. ఇంకోవైపు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు ఓటర్లు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రహ్మత్ నగర్, యూసుఫ్‌గూడ, షేక్‌పేట వంటి డివిజన్‌లలో ఓటర్ల సందడి కనిపించింది.
బోరబండలో బీఆర్ఎస్ vs కాంగ్రెస్
బోరబండ కార్పొరేటర్‌పై బీఆర్ఎస్ కార్యకర్త చేయి చేసుకున్నట్లు ఆరోపణలు
బీఆర్ఎస్ డివిజన్ నాయకులను లోపలికి అనుమతిస్తున్నారంటూ గొడవ
కాంగ్రెస్ పార్టీ షేక్‌పేట డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ పోలీసులతో వాగ్వాదం
ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు pic.twitter.com/6iKQnWjXjQ
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025