Hero Dharmendra:ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర గత 2 రోజులుగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో శ్వాస సంబంధిత వ్యాధితో పోరాడుతూ చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం ఆయన చనిపోయినట్లు మీడియాలో వార్తలు వెలువడడంతో అందరూ పెద్ద ఎత్తున ఆయన మరణానికి సంతాపం తెలియజేశారు. పలువురు సోషల్ మీడియా ద్వారా తమ బాధను వ్యక్తపరిచారు. ఇక ఎక్కడ చూసినా.. ఏ న్యూస్ ఛానల్ చూసినా ధర్మేంద్ర చనిపోయినట్లు వార్తలు వెలువడడంతో ఈ వార్తలు విని షాక్ అయిన కూతురు ఈషా డియోల్, భార్య హేమమాలిని మీడియాపై మండిపడుతూ పోస్ట్ పెట్టారు.
దీనిపై ఆయన కూతురు ఈషా డియోల్ స్పందిస్తూ .. చికిత్స తీసుకుంటూ.. చికిత్సకు సహకరిస్తున్న మా నాన్న చనిపోయాడు అంటూ వార్తలు స్ప్రెడ్ చేశారు. ఆయన చనిపోలేదు. ఆయన మరణించారంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. కనీసం బాధ్యతయుతంగా ప్రవర్తించకుండా ఎందుకిలా చేస్తున్నారు అంటూ హేమమాలిని – ధర్మేంద్రల కూతురు ఈషా డియోల్ మీడియాపై మండిపడింది. ప్రస్తుతం తన తండ్రి చనిపోలేదు అంటూ క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు గట్టి కౌంటర్ ఇచ్చింది ఈషా డియోల్.
ఇకపోతే ధర్మేంద్ర చనిపోయారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవ్వడంతో.. ఆయన రెండవ భార్య ప్రముఖ హీరోయిన్ హేమమాలిని ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ మీడియాపై మండిపడ్డారు. “తాజాగా ధర్మేంద్ర మరణించారు అంటూ వస్తున్న వార్తలు క్షమించరానివి. చికిత్సకు సహకరిస్తూ చికిత్స తీసుకుంటున్న ఒక వ్యక్తి గురించి ఇలా తప్పుడు వార్తలు రాయడం ఏ మేరకు సమంజసం. ముఖ్యంగా కొన్ని చానల్స్ బాధ్యతాయుతంగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయి. ఇది చాలా అగౌరవం.. బాధ్యతారహితంగా అనిపిస్తోంది.. దయచేసి మా కుటుంబానికి, మా గోప్యతకు భంగం కలిగించకండి” అంటూ హేమమాలిని ట్వీట్ చేసింది.
also read:Hero Dharmendra: భార్య ఉండగానే.. మతం మారి రెండో పెళ్లి.. ధర్మేంద్ర జీవితంలో అన్నీ ట్విస్ట్ లే