ABC Juice: ABC జ్యూస్ అనేది యాపిల్, బీట్‌రూట్, క్యారెట్‌ల మిశ్రమంతో తయారు చేయబడిన ఒక శక్తివంతమైన డ్రింక్. ఇది కేవలం రుచికరమైనదే కాకుండా. శరీరం మొత్తానికి అపారమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించే పోషకాహార నిధి. ఈ మూడు పదార్థాల కలయిక వల్ల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు,ఫైబర్ సమృద్ధిగా లభిస్తాయి. అందుకే ప్రతి రోజు ఏబీసీ జ్యూస్ తాగాలని నిపుణులు చెబుతుంటారు. ఏబీసీ జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ABC జ్యూస్ అంటే ఏంటి ?
ABC అనేది ఈ జ్యూస్‌లో ఉపయోగించే మూడు ప్రధాన పదార్థాలను సూచిస్తుంది.
A – ఆపిల్ (Apple)
B – బీట్‌రూట్ (Beetroot)
C – క్యారెట్ (Carrot)
ఈ మూడు పదార్థాలను సమపాళ్లలో లేదా కొద్దిగా అటుఇటుగా కలిపి. రుచి కోసం కొద్దిగా అల్లం లేదా నిమ్మరసం కలిపి జ్యూస్ తయారు చేస్తారు. ఈ జ్యూస్‌లో విటమిన్లు A, C, K, B-విటమిన్లు, ఫోలేట్, పొటాషియం, ఐరన్ , ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
ప్రతిరోజూ ABC జ్యూస్ తాగడానికి 5 ముఖ్యమైన కారణాలు:
1. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
ABC జ్యూస్‌లో విటమిన్ C , A (బీటా-కెరోటిన్ రూపంలో) అధికంగా ఉంటాయి. క్యారెట్ , యాపిల్‌లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్‌లు, యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. తద్వారా జలుబు, ఫ్లూ వంటి సాధారణ అంటువ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
2. రక్త శుద్ధ, రక్తహీనత నివారణ:
ముఖ్యంగా బీట్‌రూట్, క్యారెట్‌లు రక్తం తయారవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. బీట్‌రూట్‌లో ఫోలేట్, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి. ఇది రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చాలా ప్రయోజనకరం. ఈ జ్యూస్ రక్తాన్ని శుద్ధి చేసి.. శరీరంలోని కీలక అవయవాలకు ఆక్సిజన్‌ను సమర్థవంతంగా చేరవేయడానికి తోడ్పడుతుంది.
3. గుండె, మెదడు ఆరోగ్యం మెరుగుదల:
ABC జ్యూస్‌లో ఉండే నైట్రేట్‌లు ఆరోగ్యానికి చాలా మంచివి.
బీట్‌రూట్‌లోని నైట్రేట్‌లు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌గా మారి రక్త నాళాలను విస్తరింపజేస్తాయి. దీనివల్ల రక్తపోటు తగ్గుతుంది. అంతే కాకుండా గుండెపై భారం తగ్గుతుంది. మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడటం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత కూడా పెరుగుతాయి.
Also Read: రోజును ఉల్లాసంగా ప్రారంభించడానికి 7 మార్గాలు..
4. చర్మ సౌందర్యం, కాంతి:
ABC జ్యూస్‌ను “బ్యూటీ డ్రింక్” అని కూడా అంటారు. క్యారెట్‌లలో ఉండే విటమిన్ A మరియు యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది చర్మంపై ఏర్పడే మచ్చలు, మొటిమలను తగ్గించి.. వృద్ధాప్య సంకేతాలను ఆలస్యం చేస్తుంది. ఈ జ్యూస్ శరీరంలోని మలినాలను తొలగించడం ద్వారా చర్మానికి సహజమైన, లోపలి నుంచి కాంతిని అందిస్తుంది.
5. జీర్ణక్రియకు , బరువు తగ్గడానికి సహాయం:
ఈ జ్యూస్‌లో అన్ని పదార్థాల నుంచి ఫైబర్ (పీచు) లభిస్తుంది (తొక్క తీయకుండా చేస్తే మరింత ఫైబర్ లభిస్తుంది). ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచి, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఇది కడుపు నిండిన భావనను ఎక్కువసేపు ఉంచుతుంది. తద్వారా అనవసరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక తగ్గుతుంది. తక్కువ కేలరీలు, అధిక పోషకాల కారణంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన మార్నింగ్ డ్రింక్