Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికలకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో మొదటిసారి డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నారు. నియోజకవర్గం మొత్తంలో 150 డ్రోన్స్ వినియోగించి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడి ఉన్న చోటును ట్రాక్ చేస్తూ.. డ్రోన్ ఫ్లయింగ్ చేస్తున్నారు ఆపరేటర్లు.
పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ జోరుగా కొనసాగుతుంది. జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజలు.. నియోజకవర్గంలోని రహ్మత్ నగర్, యూసుఫ్‌గూడ, షేక్‌పేట తదితర డివిజన్‌లలో ఓటింగ్ సందడి అవుతుంది.
ఓటు హక్కు వినియోగించుకున్న డైరెక్టర్ రాజమౌళి కుటుంబం..
ఈ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. షేక్‌పేట్ డివిజన్ గేమ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ప్రముఖ సినీ దర్శకులు రాజమౌళి దంపతులు, కుమారుడు కార్తికేయ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్ నెంబర్ 28లో రాజమౌళి, రమా రాజమౌళి, కార్తికేయ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు వేసిన దర్శకుడు రాజమౌళి
క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్న రాజమౌళి
షేక్‌పేట డివిజన్లోని పోలింగ్ స్టేషన్-28లో ఓటు వేసిన రాజమౌళి దంపతులు #JubileeHillsByElection pic.twitter.com/1FjfZzbuV8
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025
ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్..
జూబ్లీహిల్ ఉప ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్.. అంతేకాకుండా మీడియాతో మాట్లాడుతూ పోలింగ్ ఏర్పాట్లను పరీశిలించడానికి పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాను.. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది అని చెప్పారు. మొదటి 45 నిమిషాలలోనే దాదాపు 70 నుంచి 100 ఓట్లు పోలయ్యాయని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తెలిపారు..
జూబ్లీహిల్ ఉప ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ #JubileeHillsByElection pic.twitter.com/uADmz8RrsZ
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025
Also Read: కౌంట్‌డౌన్ స్టార్ట్.. జూబ్లీ పీఠం ఎవరిది..?
ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటు వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత.. అలాగే బోరబండలోని పోలింగ్ కేంద్రాలును పరిశీలించిన BRS అభ్యర్థి మాగంటి సునీత.. పోలింగ్ ఏర్పాట్లు సరిగా లేవన్నారు.. ఓటు వేయడానికి వచ్చిన వారు చాలా సేపు క్యూ లైన్ లో నిలబడి ఉండాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పోలింగ్ బూత్‌లు ఇరుకుగా, చిన్నవిగా ఉన్నయన్నారు.
ఓటు హక్కు వినియోగించుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత #JubileeHillsByElection pic.twitter.com/5ZD0alYgqc
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025