Mega 158: మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో షూటింగ్ పనులను కూడా శరవేగంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కిన విశ్వంభర సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బాబి(Boby) డైరెక్షన్ లో చేయబోతున్నారు.
నవంబర్ నెలలో ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకొని త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభించబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిరంజీవి సినిమాలో మరొక కోలీవుడ్ నటుడు కార్తీ (Karthi)కీలకపాత్రలో చిరంజీవి పక్కనే కనిపించబోతున్నట్లు సమాచారం .ఈ సినిమాలో కార్తీ ఫుల్ లెన్త్ పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాని 2027 సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతం అందించగా, కార్తీక్ ఘట్టమనేని డిఓపిగా పనిచేస్తున్నారు. ఇటీవల కార్తీక ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా నటించిన మిరాయ్ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఇదివరకు బాబి చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా సూపర్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో మరోసారి చిరంజీవి బాబికి అవకాశం కల్పించారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ (Ravi teja)క్యామియో పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
Actor KARTHI is reportedly playing a full length role alongside MEGASTAR CHIRANJEEVI in “MEGA158” Directed by BOBBY KOLLI and Produced by KVN Productions.
The film is a massive gangster action drama aiming for a SANKRANTI 2027 Release
while Thaman S handling music and Karthik… pic.twitter.com/AyFwjiwH7t— BIG TV Cinema (@BigtvCinema) October 26, 2025
ఇక ప్రస్తుతం చిరంజీవితో చేయబోయే సినిమాలో కార్తీ ఫుల్ లెన్త్ పాత్రలో నటించబోతున్నారని విషయం తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కార్తీ ఇదివరకు నాగార్జున నటించిన ఊపిరి సినిమాలో క్యామియో పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు .అలాగే ఈయనకు తెలుగులో కూడా మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే . ఇక ఇప్పుడు చిరంజీవి సినిమాలో కార్తీ కనిపించబోతున్నారని విషయం తెలియగానే సినిమా పట్ల మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారకంగా వెల్లడించాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా రాశి ఖన్నా, మాళవిక మోహనన్ నటించిన అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఈ విషయంపై ఎలాంటి అధికారక ప్రకటన వెలబడలేదు.
Also Read: Tollywood Director: సక్సెస్ బాటలో కొత్త దర్శకులు.. విజయ రహస్యం అదేనా?