OTT Movie : హై ఇంటెన్సిటీ హారర్, నాన్‌స్టాప్ యాక్షన్, రియలిస్టిక్ ఎఫెక్ట్స్ తో ఒక తైవాన్ హారర్ ఫిల్మ్ చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తోంది. ఇది ఒక జాంబీ హారర్ మూవీ, కానీ సాధారణ జాంబీ సినిమాల్లా ఉండదు. అంతకు మించిన హింస, భయంకరమైన దృశ్యాలు ఉంటాయి. ఈ సినిమాలో 99% సీన్స్‌లో రియలిస్టిక్ ఎఫెక్ట్స్ ఉపయోగించారు. అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ కాకుండా ప్రాక్టికల్ ఎఫెక్ట్స్ లో ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా 99 నిమిషాల పాటు ఒక యూనిక్ ఎక్స్‌పీరియన్స్ ని ఇస్తుంది. హారర్ మూవీస్ ఇష్టపడేవాళ్లకు ఇది ఒక మరచిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఈ సినిమా పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే
‘ది సాడ్‌నెస్’ (The Sadness) అనే సినిమా 2021లో విడుదలైన తైవాన్ హారర్ ఫిల్మ్. దీన్ని రాబ్ జబ్బాజ్ అనే కెనడియన్ డైరెక్టర్ తీశాడు. ఇందులో బెరాంట్ ఝూ, రెజీనా లీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2021 జనవరి 22న తైవాన్‌లో థియేట్రికల్ విడుదల అయింది. ఈ సినిమా Shudder, Prime Videoలో అందుబాటులో ఉంది. ఈ సినిమా ఫెస్టివల్ అవార్డ్స్ లో బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్ అవార్డ్స్ గెలిచింది.
తైవాన్‌లో జిమ్, కాట్ అనే ప్రేమ లవ్ లో ఉంటారు. సిటీలో షికారు చేస్తుంటారు. అయితే నగరంలో ‘ది సాడ్‌నెస్’ ఒక వైరస్ వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ వచ్చినవాళ్లు జాంబీల్లా కాకుండా, చాలా క్రూరంగా, హింసాత్మకంగా మారతారు. వాళ్లు ఎదుటివాళ్లను చంపడం, హింసించడం, దాడి చేయడం వంటివి చేస్తారు. ఈ సినిమా మొత్తం ఒకే రోజులో జరుగుతుంది. నగరం ఒక్కసారిగా గందరగోళంలోకి వెళ్తుంది. ఈ సమయంలో జిమ్, కాట్ విడిపోతారు. వాళ్లు మళ్లీ కలవడానికి ప్రయత్నిస్తూ, ఇద్దరూ విడివిడిగా ఈ ఇన్‌ఫెక్టెడ్ నగరంలో బతకడానికి పోరాడతారు.
Read Also : 8000 లీటర్ల బ్లడీ బ్లడ్ బాత్… బ్రూటల్ క్లైమాక్స్ మావా… గుండె ధైర్యం ఉంటేనే ఈ హర్రర్ మూవీని చూడండి
సబ్‌వేలో జరిగే దాడులు, ఇళ్లలోకి చొరబడే ఇన్‌ఫెక్టెడ్ మనుషులు, రోడ్లపై రక్తం వంటి దృశ్యాలు ఒళ్ళు జలదరించేలా ఉంటాయి. ఈ వైరస్‌తో ఇన్‌ఫెక్ట్ అయినవాళ్లు కేవలం చంపడమే కాదు, చాలా దారుణంగా, సాడిస్టిక్‌గా, ఇతరులను బాధపెట్టడంలో ఆనందం పొందుతుంటారు. మరో వైపు జిమ్, కాట్‌లు తమ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని, ఒకరినొకరు కలవడానికి ప్రతి అడుగులో ఫైట్ చేస్తారు. కానీ ప్రతి స్టెప్‌లో డేంజర్ పెరుగుతూ ఉంటుంది. కోవిడ్ సమయంలో వచ్చిన ఈ సినిమా, మహమ్మారి గురించి ఒక డార్క్ ఇమాజినేషన్‌లా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో షాకింగ్ ట్విస్ట్‌లు, ఎమోషనల్ మూమెంట్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ని బెదరగొడుతుంది.