BigTV English
Advertisement

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ నేతల ప్రచారంపై కేటీఆర్ ఆరా

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ నేతల ప్రచారంపై కేటీఆర్ ఆరా

జూబ్లీహిల్స్ లో గెలుపుకోసం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుంది. ఈ తరుణంలో పార్టీ నాయకులు పనిచేస్తున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు సిద్ధమైంది. డివిజన్లలో ఎంతమంది నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.. వారు ఎవరెవరిని కలుస్తున్నారు.. ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచారం చేస్తున్నారా?.. ప్రభుత్వ వైఫల్యాలను ఏమేరకు వివరిస్తున్నారు.. గ్యారెంటీ కార్డులను సైతం ప్రజలకు అందజేసి బీఆర్ఎస్ వైపునకు ఆకర్షించేలా ఎలాంటి చతురతను అవలంభిస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. సొంతపార్టీ నేతల కదలికలపై పార్టీ అధిష్టానం నిఘా పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఏం చేస్తున్నారు.. ఏయే కాలనీలో ఎవరెవరిని కలుస్తున్నారు.. ఏ రోజు ఏ కాలనీలో ప్రచారం చేస్తున్నారేనే వివరాలు తమకు తెలుసు అని గులాబీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో తాజాగా జూబ్లీహిల్స్ పార్టీ ఇన్ చార్జులు, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలోనే సదరు విషయాలు వెల్లడించడం చర్చకు దారితీసింది.


నవీన్ యాదవ్‌తో బీఆర్ఎస్ నేతల ఫోటోలు హల్‌చల్:

దానికి కారణం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తో బీఆర్ఎస్ నేతలు దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటమే అంటున్నారు. నవీన్ యాదవ్ గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేయడం, నేతలతో సంబంధాలు కలిసి ఉండటంతో గులాబీ పార్టీ అలర్ట్ అయిందంట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గులాబీకి డూర్ ఆర్ డై కావడంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. రాబోయే ఎన్నికలకు ఇది నాంది అని నేతలు ఇప్పటికే బహిరంగంగానే పేర్కొంటున్నారు.
జూబ్లీహిల్స్‌ లో పార్టీ గెలిస్తే, రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుస్తామని, మళ్లీ వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇది తొలిమెట్టు అని బీఆర్ఎస్ ముఖ్య నేతలు అభిప్రాయ పడుతున్నారు. దీంతో ఉప ఎన్నికలను సీరియస్ గా తీసుకొని ముందుకు సాగుతోంది. ఆ క్రమంలో సొంతపార్టీనేతలపై నిఘా పెట్టడంపై విస్తృత చర్చ జరుగుతుంది. బాధ్యతలు అప్పగించినప్పటికీ ప్రచార సరళిపై ఆరా తీస్తుంది.ఎందుకు ఇలా చేస్తుందనేది కూడా చర్చనీయాంశమైంది.

ఉప ఎన్నికల్లో నేతల పనితనం బట్టి రాబోయే కాలంలో పదవులు:

పార్టీకోసం పనిచేస్తున్నామని నేతలు బహిరంగంగా పేర్కొంటున్నప్పటికీ పార్టీ మాత్రం నేతలను కదలికలను గమనిస్తోందంట. ఉప ఎన్నికల్లో నేతల పనితనం బట్టి రాబోయే కాలంలో పదవులు అప్పగించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా 40 మంది, డివిజన్ ఇన్ చార్జులు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ ఇంకా నియోజకవర్గ ఓటర్లను కలవాలని, వారికి ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని, వారిని ఎలా ఆకట్టుకోవాలనే అంశాలపై మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇంకో వైపు నేతలకు హెచ్చరికలు సైతం జారీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నేతలకు కేసీఆర్ సైతం దిశానిర్దేశం చేశారు. పకడ్బందీగా ఎన్నికల వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. బీఆర్‌ఎస్‌ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా గ్రేటర్‌లో మాత్రం తన పట్టును కోల్పోలేదు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే జీహెచ్‌ఎంసీ పీఠం తప్పక కైవసం చేసుకోవాలనే ఆలోచనలో గులాబీ దళం పని చేస్తుంది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగే అవకాశాలున్నాయనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితలో కేసీఆర్ పేరును పెట్టింది బీఆర్ఎస్.


స్టార్ క్యాంపెయినర్ల జాబితాల్లో ముందున్న కేసీఆర్ పేరు:

బీఆర్‌ఎస్‌ వెల్లడించిన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్‌ పేరు ఉండడం ఆసక్తికరంగా మారింది. ఒకటి రెండు సభలకు కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఇప్పటికే మూడు, నాలుగు చోట్ల బహిరంగ సభలు నిర్వహించిన పార్టీ అగ్ర నాయకులు, ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. మిగతా పార్టీల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్‌ఎస్‌.. ప్రచార పర్వాన్ని కూడా అదేరీతిన కొనసాగిస్తోంది. ముఖ్యనేతలకు డివిజన్ల వారీగా బాధ్యతను అప్పగించింది గులాబీ పార్టీ. సెంటిమెంటు, సానుభూతి అంశం తమకు కలిసి వస్తుందన్న ధీమాతో బీఆర్‌ఎస్‌ నేతలు ఉన్నారట. బీఆర్ఎస్ విడుదల చేసిన స్టార్ కాంపెయిన్ లిస్ట్ లో మొదటి పేరు కేసీఆర్ దే అవ్వడం గమనార్హం.. దీంతో గులాబీ పార్టీ వర్గాల్లో కేసీఆర్ జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొంటారు అని చర్చ నడుస్తుంది . ఈ నెల చివరన కేసీఆర్ జూబ్లీహిల్స్ లో క్యాంపెయిన్ చేస్తారు అన్న వార్తతో కార్యకర్తల్లో జోష్ నెలకొంది. ఒకవేళ నిజంగానే కేసీఆర్ జూబ్లీహిల్స్ ప్రచారంలో పాల్గొంటే మాగంటి సునీత గెలుపును ఎవ్వరు ఆపలేరు అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది .

Story by Apparao, Bigtv

Related News

Tirumala parakamani: మిస్టరీగా మారిన పరకామణి కేసు

Private Bus: జనం ప్రాణాలతో.. ప్రైవేట్ ట్రావెల్స్ ఆటలు !

CM Revanth: రైతుల భూ సమస్యలకు.. సీఎం రేవంత్ శాశ్వత పరిష్కారం

CM Revanth: పట్టణ ప్రాంత పేదలకు శుభవార్త జీ+1 తరహాలో.. ఇందిరమ్మ ఇండ్లు

West Godavari: పశ్చిమ టీడీపీ పగ్గాలు ఎవరికో?

Pocharam Srinivas: చెప్పుతో కొట్టండి! పోచారం స్వరం మారుతుందా?

Dharmana prasada : కొడుకు ఎంట్రీ.. రాజకీయాలకు ధర్మాన గుడ్ బై..!

Big Stories

×