Jigris Movie : ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీతో ఆకట్టుకున్న యంగ్ హీరో రామ్ నితిన్ మరో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. ‘జిగ్రీస్’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్ నితిన్ తో పాటు కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ‘ఈ నగరానికి ఏమైంది’, ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమాల తరహాలోనే రాబోతున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ ఫిక్స్ చేశారు.
దర్శకుడు హరీష్ రెడ్డి ఉప్పుల ‘జిగ్రీస్’ చిత్రానికి దర్శకత్వం వహించగా, మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. అలాగే రెబల్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులోనే మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ 14న మూవీ థియటర్లలోకి రాబోతోందని మేకర్స్ ప్రభాస్ బర్త్ డే పోస్టర్ తో అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యకమాలను షురూ చేయనున్నారు.
ఈ యూత్ ఫుల్ ఎంటెర్టైనర్ కు సెలబ్రిటీల సపోర్ట్ స్ట్రాంగ్ గానే ఉంది. ఇటీవల ‘జిగ్రీస్’ మూవీ టీజర్ రిలీజ్ కాగా.. అందరినీ ఆకట్టుకుంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ టీజర్ ను రిలీజ్ చేయగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. టీజర్ రికార్డ్ స్థాయి వ్యూస్ రాబట్టడంతో పాటు సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేయడం విశేషం. క్యాచీ డైలాగ్స్ తో టీజర్ యూత్ ను బాగా అట్రాక్ట్ చేసింది.
ఇక ‘యానిమల్’ వంటి బ్లాక్ బస్టర్ తో మంచి ఫామ్ లో ఉన్న పాన్ ఇండియా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ‘జిగ్రీస్’ డైరెక్టర్ కు మంచి అనుబంధం ఉంది. సందీప్ కు హరీష్ రెడ్డి చిన్నప్పటి ఫ్రెండ్. అందుకే దగ్గరుండి మరీ సందీప్ రెడ్డి ఈ సినిమాకు ప్రమోషన్ల రూపంలో సపోర్ట్ చేస్తున్నారు. సందీప్ రెడ్డి మాత్రమే కాదు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఈ సినిమాకు తన సపోర్ట్ అందించారు. ‘జిగ్రీస్’ సినిమాలోని ఫస్ట్ లిరికల్ సాంగ్ ను కిరణ్ అబ్బవరం రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్ కారు ట్రిప్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఫస్ట్ సాంగ్ గా వచ్చిన ‘తిరిగే భూమి’ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. డైరెక్టర్ హరీష్ రెడ్డి ఈ సాంగ్ కు లిరిక్స్ అందించగా, కమ్రాన్ సయ్యద్ మ్యూజిక్ అందించారు. ఇక ఇప్పుడు ఈ మూవీని నవంబర్ రేసులో దింపడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్.
Read Also : కంటికి కన్పించని అమ్మాయితో ఆ పని… ఇంత ఓపెన్ గా ఎలారా అయ్యా ? ఇయర్ ఫోన్స్ డోంట్ మిస్