Kingdom Movie: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం కింగ్డమ్(Kingdom). గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి అంటూ వార్తలు కూడా తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా కలెక్షన్ల గురించి, ఈ సినిమాకు నష్టాలు వచ్చాయి అంటూ వస్తున్న వార్తల గురించి నిర్మాత నాగ వంశీ (Nagavamshi)మొదటిసారి స్పందిస్తూ ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం నాగ వంశీ మాస్ జాతర (Mass Jathara)సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా కింగ్డమ్ సినిమా గురించి మాట్లాడారు. కింగ్డమ్ సినిమా గురించి నాగ వంశీ మాట్లాడుతూ నా దృష్టిలో ఈ సినిమా అసలు ఫ్లాప్ కాదని తెలిపారు. ఈ సినిమా ఫ్లాప్ అంటూ ఎందుకు ప్రచారం చేశారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదని ఈయన వెల్లడించారు. ఈ సినిమాకు ఓవర్సీస్ లో సుమారు 28 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి అలాగే నైజాం ఏరియాలో రూ.12 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఇలా ఈ స్థాయిలో కలెక్షన్లు వచ్చినప్పటికీ ఈ సినిమా ఫ్లాప్ అని ఎందుకు ప్రచారం చేస్తున్నారో తెలియడం లేదని వెల్లడించారు. ఇక ఈ సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్లు కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారని తెలిపారు.
ఒకరు ఇద్దరు మాత్రమే కాస్త నష్టాలను చవిచూసారని అయితే వాటిని కూడా జిఎస్టి రూపంలో రిటర్న్ ఇచ్చేసాము కింగ్డమ్ సినిమా విషయంలో ప్రతి ఒక్కరూ కూడా సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఎవరు నష్టాలను ఎదుర్కోలేదని ఈ సినిమా మాకు ఏమాత్రం నష్టాలను మిగిల్చలేదు అంటూ మొదటిసారి ఈ సినిమా కలెక్షన్ల గురించి నాగ వంశీ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇక మాస్ జాతర సినిమా విషయానికి వస్తే.. రవితేజ శ్రీ లీల ప్రధాన పాత్రలో నటించి సందడి చేశారు.
బాహుబలి ది ఎపిక్ ఎఫెక్ట్..
ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేసాయి. ఇక ఈ సినిమా అక్టోబర్ 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు కానీ ఒకరోజు ఈ సినిమా వాయిదా పడిందని నిర్మాత నాగ వంశీ తెలిపారు. అక్టోబర్ 31వ తేదీ బాహుబలి ది ఎపిక్ సినిమా రాబోతున్న నేపథ్యంలో అక్టోబర్ 31 న మాస్ జాతర ప్రీమియర్లను ప్రసారం చేసి నవంబర్ ఒకటవ తేదీ విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. రవితేజ శ్రీ లీల కాంబినేషన్లో ధమాకా తర్వాత రాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో రవితేజ మరోసారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే ఈ సినిమాతో రవితేజ మరో బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది.
Also Read: Nari Nari Naduma Murari: రెమ్యూనరేషన్ పై నిర్మాతకు షాక్ .. సంక్రాంతి విడుదల కష్టమే?