Yellamma: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక దర్శకుడిగా ప్రూవ్ చేసుకోవడానికి కూడా సరైన టైమ్ రావాలి. చిన్న చిన్న సినిమాల్లో నటుడుగా కనిపించి కొంత మేరకు గుర్తింపు సాధించుకున్నాడు వేణు. ఆ తరువాత ఈటీవీలో వచ్చిన జబర్దస్త్ అనే కామెడీ షో చాలామంది కమెడియన్స్ కి విపరీతమైన గుర్తింపు ఇచ్చింది. జబర్దస్త్ షో ద్వారా వేణు కూడా మంచి గుర్తింపు సాధించుకున్నాడు. ఆ షో లో చేసిన ఒక స్కిట్ వలన కొన్ని అవమానాలు కూడా ఎదుర్కొన్నాడు.
అయితే వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ప్రియదర్శి నటించిన ఈ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత వేణు దర్శకత్వంలో నాని హీరోగా ఎల్లమ్మ అనే సినిమా వస్తున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. దర్శక నిర్మాతల కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు.
నాని హీరోగా ఎల్లమ్మ సినిమా వస్తుంది అని అందరూ భావించారు. అయితే నానికి ఉన్న కమిట్మెంట్స్ మరియు కొన్ని కారణాల వలన ఈ సినిమాను నాని చేయలేదు. బలగం సినిమా ఈ దశాబ్దంలోనే నాకు బాగా ఇష్టమైన సినిమా అని నాని స్టేట్మెంట్స్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు చేయలేదు.
నితిన్ హీరోగా ఎల్లమ్మ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ చేసిన తమ్ముడు సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్టు కూడా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఈ సినిమాలో దేవిశ్రీప్రసాద్ హీరోగా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారి ప్రకారం త్వరలో రావాల్సి ఉంది.
బలగం సినిమా హిట్ అయిన తర్వాత నాని హీరోగా సినిమా అన్నప్పుడు చాలామంది టెక్నీషియన్స్ ఈ ప్రాజెక్టులోకి యాడ్ అయ్యారు. అయితే సంగీత దర్శకుడుగా అజయ్ అతుల్ ను వేణు అనుకున్నాడు.
దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో ఇంటర్ అయిన తర్వాత అజయ్ అతుల్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటారా లేదా అనే సందేహం చాలా మందికి వచ్చింది. ఎందుకంటే స్వతహాగా దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకులు కాబట్టి. మొత్తానికి ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి కూడా అధికారిక ప్రకారం త్వరలో రావాల్సి ఉంది.
Also Read: Ram Charan: మెహర్ రమేష్ దర్శకత్వంలో రామ్ చరణ్.? మెగా ఫ్యాన్స్ ఇంకెన్ని దారుణాలు చూడాలో