Road Accident: అల్వాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనూష (32) అనే యువతి తన భర్తతో కలిసి బైక్‌పై గజ్వెల్ వెళుతుండగా, వెనక నుంచి వేగంగా వచ్చిన ఎలక్ట్రిక్ బస్ డీకొట్టింది. ఈ ప్రమాదంలో అనూష తలపై తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త రవి (36) తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. బస్ కరీంనగర్ డిపోకు చెందినదని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళ్తే.. సాయంత్రం 6:30 గంటల సమయంలో.. అల్వాల్ బైపాస్ రోడ్డు వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అనూష, రవి దంపతులు సికింద్రాబాద్ నుంచి గజ్వెల్ కు బైక్‌పై వెళుతున్నారు. రవి బైక్ నడుపుతుండగా, వెనక నుంచి ఎలక్ట్రిక్ బస్ వేగంగా వచ్చి డీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రవి అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది.
Also Read: మద్యం షాపుల డ్రాకు సర్వం సిద్ధం
ఈ ప్రమాదానికి గల కారణం అతివేగం అని ప్రాథమికంగా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ నేపథ్యంలో బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.