OTT Movie : భారతీయ వెబ్ సిరీసుల్లో ఒక క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ బాగా పాపులర్ అయింది. ఇది ‘ఇన్వర్టెడ్ డిటెక్టివ్’ స్టైల్‌లో ఉంటుంది. అంటే ప్రతి కేసులో నేరం ఎలా జరిగిందో ముందే చూపిస్తారు. కానీ హీరో ఈ కేసును ఎలా పరిష్కరిస్తాడనేది థ్రిల్లింగ్ గా ఉంటుంది. రియల్ లైఫ్ క్రైమ్‌ల నుండి ఈ సిరీస్ ఇన్‌స్పైర్ అయింది. ఇది మైండ్ కి టెన్షన్ పెట్టిస్తూ సీట్ ఎడ్జ్ కు తీసుకెళ్తుంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళ్తే
‘అభయ్’ Abhay అనే ఈ వెబ్ సిరీస్ ను కెన్ ఘోష్ డైరెక్ట్ చేయగా, బి.పి. సింగ్ నిర్మించారు. ఇందులో బాలీవుడ్ నటుడు కునాల్ ఖేము, ఆయనతో పాటు ఎల్నాజ్ నొరౌజీ , సందీప ధార్, నమిత్ దాస్ నటించారు. మొదటి సీజన్‌లో 8 ఎపిసోడ్స్ తో 2019 ఫిబ్రవరి 7న ZEE5లో విడుదలైంది. ప్రతి ఎపిసోడ్ సుమారు 40 నుంచి 50 నిమిషాలు ఉంటుంది. 2020లో సీజన్ 2, 2022లో సీజన్ 3 కూడా వచ్చాయి. ఐయండిబిలో దీనకి 7.5/10 రేటింగ్ ఉంది.
అభయ్ ప్రతాప్ సింగ్ అనే ఒక స్పెషల్ పోలీసు అధికారి, క్రిమినల్స్ మనస్తత్వాన్ని అర్థం చేసుకుని, వారి కంటే ఒక అడుగు ముందు ఆలోచించే స్మార్ట్ డిటెక్టివ్. అయితే అతని జీవితంలో భార్య మరణం తట్టుకోలేకపోతారు. తన కొడుకు సాహిల్ బాధ్యతగా చూసుకోవాలనుకుంటాడు. సీజన్ 1లో, అభయ్ తన టీమ్‌తో కలిసి మూడు పెద్ద క్రైమ్ కేసులను సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ప్రతి కేసు నిజ జీవిత ఘటనల నుండి ఈ సిరీస్ స్ఫూర్తి పొందింది. మొదటి కేసు నోయిడాలోని చాలా మంది పిల్లలు మాయమవుతారు. అభయ్ ఈ సీరియల్ కిల్లింగ్స్ వెనుక ఉన్న క్రూరమైన నేరస్థుడిని పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. రెండవ కేసులో ఒక గ్యాంగ్‌స్టర్ ని టార్గెట్ చేస్తాడు. మూడవ కేసు లక్నోలో జరిగే సైకో కిల్లర్ కేసు, ఇక్కడ విక్టిమ్స్ ముఖంపై సిగరెట్ బర్న్స్ ఉంటాయి. అభయ్ ఈ కేసులో మైండ్ గేమ్స్ ఆడుతూ కిల్లర్‌ని ట్రాప్ చేస్తాడు.
Read Also : మొదటి రాత్రే వదిలేసే భర్త… ఫొటోగ్రాఫర్ తో పని కానిచ్చే భార్య… మనసుకు హత్తుకునే రొమాంటిక్ డ్రామా