Tollywood Directors: ఇటీవల కాలంలో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది అంటే దర్శక నిర్మాతలు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. సినిమాలో స్టార్ట్ హీరో హీరోయిన్లు నటించిన స్టార్ దర్శకుడు సినిమా కోసం పనిచేసిన కొన్నిసార్లు ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోతుంది. అయితే ఇటీవల కాలంలో కొంతమంది కొత్త దర్శకులు ఇండస్ట్రీలోకి రావడంతోనే సూపర్ హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఇలా ఎంతోమంది యంగ్ డైరెక్టర్స్ ఎలాంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను విడుదల చేస్తూ సంచలనాలను సృష్టిస్తున్నారు.
ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే సక్సెస్ అందుకున్న వారిలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన దర్శకులు చాలామంది ఉన్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతూ మంచి సక్సెస్ అందుకున్న వారిలో ప్రశాంత్ వర్మ ఒకరు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సూపర్ హీరో జోనర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం హనుమాన్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ సినిమాలు తేజ సజ్జ అద్భుతమైన నటనను కనపరిచారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం జై హనుమాన్ కూడా ప్రకటించారు.
ఇక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో హిట్ సిరీస్ ఒకటి. ఇప్పటికే హిట్ సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఇలా ఈ సినిమా ద్వారా డైరెక్టర్ సైలెంట్ అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుని ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్నారు. అరిషడ్వర్గాలు అనే మైథాలజికల్ అంశంపై సస్పెన్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అరి. జయశంకర్ దర్శకుడిగా పేపర్ బాయ్ సినిమా ద్వారా పరిచయమవుతూ ఈ సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు అరి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు.
కథలో సత్తా ఉంటే చాలు..
ఇకపోతే 96 సత్యం సుందరం వంటి సినిమాలతో తమిళ దర్శకుడు ప్రేమ్ కుమార్ కూడా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా ఈ దర్శకులందరూ ఇండస్ట్రీకి పరిచయం అయిన కొత్తలోనే ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నారు. అయితే కొత్త దర్శకులు అయినప్పటికీ వీరి సక్సెస్ కి కారణం కథ అనే చెప్పాలి. బలమైన కథ నేపథ్యం అలాగే వినూత్న కథాంశమే సినిమా సక్సెస్ కు కారణం అయ్యాయని చెప్పాలి. కథలో సత్తా ఉంటే చిన్న సినిమా అయినా పెద్ద హిట్ అవుతుందని ఈ సినిమాలన్నీ నిరూపించాయి. కథలు బలం లేకపోయినా వందల కోట్లు ఖర్చు చేసిన సినిమాని విజయవంతంగా ముందుకు నడిపించలేమని ఇదివరకు ఎన్నో సినిమాలు కూడా నిరూపించాయి.
Also Read: Spirit Movie: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సెట్స్ పైకి స్పిరిట్..త్వరలోనే షూటింగ్!