BigTV English
Advertisement

Spirit Movie: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సెట్స్ పైకి స్పిరిట్..త్వరలోనే షూటింగ్!

Spirit Movie: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సెట్స్ పైకి స్పిరిట్..త్వరలోనే షూటింగ్!

Spirit Movie: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)ప్రస్తుతం వరుస సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఈయన హీరోగా నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ కమిట్ అయిన సినిమాలలో స్పిరిట్ సినిమా కూడా ఒకటి. డైరెక్టర్ సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ త్రిప్తి దిమ్రి హీరో హీరోయిన్ గా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లోనే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.


నవంబర్ నుంచి షూటింగ్

ఇకపోతే నవంబర్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని డైరెక్టర్ సందీప్ రెడ్డి (Sandeep Reddy)వెల్లడించారు. కానీ ఇప్పుడు కూడా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడిందని వచ్చే ఏడాది నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతుందని వార్తలు బయటకు రావడంతో ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. తాజా సమాచారం ప్రకారం స్పిరిట్ సినిమా నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించుకోబోతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 8వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయని, దాదాపు పది రోజులపాటు ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరగబోతుందని తెలుస్తోంది. అయితే ఈ పది రోజులలో ప్రభాస్ కి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తారా లేకపోతే ఆయనకు సంబంధం లేకుండా ఉండే సన్నివేశాలను షూట్ చేస్తారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

సౌండ్ స్టోరి

ఈ సినిమా నవంబర్ నుంచి షూటింగ్ పనులు ప్రారంభం కాబోతోందనే విషయం తెలిసిన ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు .ఇకపోతే ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఇటీవల ఈ సినిమా నుంచి ఒక ఆడియో టీజర్ సందీప్ రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ ఆడియో టీజర్ అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది. సౌండ్ స్టోరీ అంటూ విడుదల చేసిన ఆడియో టీజర్ వీడియోలో ప్రభాస్ వాయిస్ తో వచ్చిన డైలాగ్ అద్భుతంగా నిలిచిందని చెప్పాలి.


నాకు చెడ్డ అలవాటు ఉంది

” మిస్టర్ సూపరింటెండెంట్ నాకు చిన్నప్పటి నుంచి ఒక చెడ్డ అలవాటు ఉంది. రైట్ ఫ్రమ్ ఎ చైల్డ్ హుడ్ ఐ జస్ట్ హావ్ వన్ బ్యాడ్ హ్యాబిట్” అంటూ చెప్పిన ఈ డైలాగ్ మాత్రం టీజర్ కే హైలెట్ గా నిలిచింది. అయితే ఈ వాయిస్ ఏఐతో రూపొందించిందని తెలుస్తోంది. ఇలా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా పలు సినిమాల నుంచి పోస్టర్లు విడుదలైనప్పటికీ స్పిరిట్ సినిమా అభిమానులకు మంచి సర్ప్రైజ్ ఇచ్చిందని చెప్పాలి. ఇక ఇందులో ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారని ఈ టీజర్ వీడియో ద్వారా సందీప్ రెడ్డి వెల్లడించారు. ఇక తాజాగా సినిమా షూటింగ్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్రబృందం స్పందించాల్సి ఉంటుంది.

Also Read: Nelson -RamCharan: నెల్సన్ డైరెక్షన్ లో రామ్ చరణ్.. ఎన్టీఆర్ ను సైడ్ చేసిన డైరెక్టర్?

Related News

Nari Nari Naduma Murari: రెమ్యూనరేషన్ పై నిర్మాతకు షాక్ .. సంక్రాంతి విడుదల కష్టమే?

Mega 158: చిరంజీవి సినిమాలో కార్తీ .. బాబీ ప్లానింగ్ వేరే లెవెల్!

Jigris Movie : ‘జిగ్రీస్’ రాకకు రంగం సిద్ధం… రిలీజ్ డేట్ పోస్టర్ తో అఫిషియల్ అనౌన్స్మెంట్

Tollywood Director: సక్సెస్ బాటలో కొత్త దర్శకులు.. విజయ రహస్యం అదేనా?

Nelson -RamCharan: నెల్సన్ డైరెక్షన్ లో రామ్ చరణ్.. ఎన్టీఆర్ ను సైడ్ చేసిన డైరెక్టర్?

Yellamma: ఎల్లమ్మ సినిమాపై అప్డేట్ ఇచ్చిన వేణు.. అడ్డంకులు తొలగిపోయినట్టేనా?

Ramya krishna: శివగామి పాత్రను మిస్ చేసుకున్న శ్రీదేవి.. రమ్యకృష్ణ రియాక్షన్ ఇదే!

Big Stories

×