Nari Nari Naduma Murari: సంక్రాంతి పండుగ అంటేనే సినిమా పండుగ అని చెప్పాలి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పెద్ద హీరోల నుంచి మొదలుకొని చిన్న హీరోల సినిమాలు కూడా విడుదల అవుతూ థియేటర్ల వద్ద అసలైన పండుగ వాతావరణన్ని తీసుకొస్తుంటాయి. సంక్రాంతి పండుగను టార్గెట్ చేస్తూ ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి. ఇక ఈ ఏడాది కూడా భారీ స్థాయిలో సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రభాస్, చిరంజీవి లాంటి హీరోలతో పోటీగా చిన్న హీరోలు కూడా తమ సినిమాలను విడుదల చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నటుడు శర్వానంద్(Sharwanand) సైతం ప్రభాస్ చిరంజీవికి పోటీగా వారి సినిమాలతో పాటు నారీ నారీ నడుమ మురారి(Nari Nari Naduma Murari)సినిమాని విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.. శర్వానంద్ నటించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవ్వడం కష్టమే అని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు దాదాపు 20 రోజులపాటు షూటింగ్ జరగాల్సి ఉంది. ఇలాంటి సమయంలో శర్వానంద్ నిర్మాతకు ఊహించని షాక్ ఇచ్చారని తెలుస్తోంది.
నారీ నారీ నడుమ మురారి సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర(Anil Sunkara) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా 20 రోజులు షూటింగ్ మిగిలి ఉందన్న తరుణంలో శర్వానంద్ రెమ్యూనరేషన్ (Remuneration)విషయంలో నిర్మాతకు ఊహించని షాక్ ఇచ్చారని తెలుస్తుంది. ఉన్నఫలంగా తనకు మొత్తం రెమ్యూనరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం అయితే ప్రస్తుతం నిర్మాత అనిల్ సుంకర వ్యక్తిగత విషయాల వల్ల యూఎస్ఏ లో ఉన్నారని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో శర్వా రెమ్యూనరేషన్ విషయంలో డిమాండ్ చేస్తూ షూటింగ్ ఆపివేయడంతో ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవ్వటం కష్టమేనని పలువురు చిత్ర బృందం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
సంక్రాంతి విడుదల కాబోయే సినిమాలు..
మరి నారి నారి నడుమ మురారి సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్రబృందం ఈ వార్తలపై స్పందించాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు సామజ వరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిస. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల దీపావళి పండుగను పురస్కరించుకొని చిత్ర బృందం ఒక స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో శర్వానంద్ సాంప్రదాయంగా పంచకట్టులో ఉన్న లుక్ అందరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ సంక్రాంతి బరిలో ప్రభాస్ ది రాజా సాబ్, చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, రవితేజ కిషోర్ తిరుమల సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి.
Also Read: Mega 158: చిరంజీవి సినిమాలో కార్తీ .. బాబీ ప్లానింగ్ వేరే లెవెల్!