E-Paper
Advertisement

Allu Arjun– Aditya Dhar : ‘ధురంధర్’ దర్శకుడు ముందు అల్లు అర్జున్‌తో తీయాలనుకున్న సినిమా ఇదే.. కానీ ఎమైందంటే?

Allu Arjun– Aditya Dhar : ‘ధురంధర్’ దర్శకుడు ముందు అల్లు అర్జున్‌తో తీయాలనుకున్న సినిమా ఇదే.. కానీ ఎమైందంటే?
Advertisement

Allu Arjun– Aditya Dhar : ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్ సినిమా ఏ రేంట్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. తాజాగా ఆయన అల్లు అర్జున్ తో ఓ సినిమా తీయాలనుకున్నారట. అది కూడా అశ్వధ్ధామ కు సంబంధించినది. అయితే ఆ ప్రాజెక్ట్ కు ముందే.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కీ’ వచ్చింది. ఈ సినిమాలో అశ్వధామను నాగ్ అశ్విన్ చూపించిన తీరు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అందులోనూ.. ఆ పాత్రను అమితాబచ్చన్ చేయడంతో మరింత పాపులర్ అయింది. దీంతో ఆదిత్యధర్ అనుకున్న ప్రాజెక్ట్ అక్కడితో ముగిసిపోయింది. ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాతో సంచలనం సృష్టించిన ఆదిత్య ధర్, పురాణ గాథలకు ఆధునిక టెక్నాలజీని జోడించి ‘అశ్వత్థామ’ కథను భారీ స్థాయిలో తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. మొదట విక్కీ కౌశల్ పేరు వినిపించినా, తర్వాత అల్లు అర్జున్‌తో చర్చలు జరిగాయి.

Read also-February OTT Movies : ఫిబ్రవరిలో ఓటీటీలోకి రాబోతున్న బ్లాక్ బాస్టర్ సినిమాలు..అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..

‘కల్కి 2898 AD’ ప్రభావం

Advertisement

నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ‘కల్కి 2898 AD’ సినిమాలో అమితాబ్ బచ్చన్ పోషించిన అశ్వత్థామ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆ సినిమాలో అశ్వత్థామ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్, విజువల్స్ చూసిన తర్వాత, అదే పాత్రతో మరో సినిమా తీస్తే పోలికలు తప్పవని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఒకే అంశంపై రెండు సినిమాలు రావడం రిస్క్ అని భావించి, అలాగే బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆదిత్య ధర్ తన తదుపరి చిత్రం ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) పనుల్లో బిజీగా ఉండగా, అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో బిజీ బిజీగా ఉన్నారు. అందుకే ఈ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూసుకుంటే అల్లు అర్జున్ తో సినిమాలు చేయడానికి కోలీవుడ్ దర్శకులే కాకుండా బాలీవుడ్ దర్శకులు కూడా క్యూ కడుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో అల్లు అర్జున్ ను నిలబెట్టిన పుష్ఫ 2 సినిమా ఇటీవలే జపాన్ లో కూడా విడుదలైంది.

Read also-Sobhita dhulipala: అక్కినేని ఫ్యామిలీపై మనసులో మాట బయటపెట్టిన శోభిత?

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×