Alum For Dark Circles: ప్రస్తుతం చాలా మంది డార్క్ సర్కిల్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా నిద్రలేమి, అలసట వంటివి డార్క్ సర్కిల్స్ రావడానికి ప్రధాన కారణాలు. ఇదిలా ఉంటే డార్క్ సర్కిల్స్ ముఖ సౌందర్యాన్ని పాడు చేస్తాయి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే హోం రెమెడీస్ వాడటం మంచిది. ముఖ్యంగా పటిక డార్స్ సర్కిల్స్ తగ్గించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. పటికను చర్మ సౌందర్యానికి చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. ఇంతకీ పటికను డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి ఎలా ఉపయోగించాలనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పటిక వల్ల కలిగే ప్రయోజనాలు:
బగుతుగా మారుస్తంది: పటికలో సహజంగా ఆస్ట్రింజెట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని తాత్కాలికంగా సంకోచించేలా చేస్తుంది. దీని వల్ల చర్మం కూడా బిగుతుగా మారుతుంది. అంతే కాకుండా కళ్ల కింద చర్మం వదులుగా ఉండటం వల్ల కనిపించే డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి.
వాపు తగ్గుతుంది:
పటికలో స్వల్పంగా వాపును తగ్గించే గుణాలు కూడా ఉంటాయి. దీని వల్ల కళ్ల కింత ఉండే వాపు కూడా చాలా వరకు తగ్గుతుంది. అంతే కాకుండా ఇది డార్క్ సర్కిల్స్ కనిపించడాన్ని కూడా నివారిస్తుంది.
రక్తనాళాల సంకోచం:
కొందరికి కళ్ల క్రింద రక్తనాళాలు కూడా స్పష్టంగా కనిపించడం వల్ల డార్క్ సర్కిల్స్ సమస్య పెరుగుతుంది. పటిక రక్త నాళాలను సంకోచించేలా చేసి డార్క్ సర్కిల్స్ కనిపించకుండా కూడా సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్:
కొన్ని అధ్యయనాల ప్రకారం.. పటికలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీనిని వాడటం వల్ల నల్ల మచ్చలు కూడా తగ్గుతాయి. అంతే కాకుండా ముడతలు కూడా రాకుండా ఉంటాయి.
డార్క్ సర్కిల్స్ కోసం పటికను ఎలా వాడాలి ?
పటికను నేరుగా ఎక్కువ మోతాదులో లేదా ఎక్కువ సమయం పాటు సున్నితమైన కళ్ల చుట్టూ ఉన్న చర్మానికి అస్సలు వాడకూడదు. దీనిని తక్కువ మోతాదులో ఉపయోగించడం వల్ల మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయి.