 
					Sun pictures : చాలామంది ఇండస్ట్రీకి దర్శకులుగా తమను తాము ప్రూవ్ చేసుకోవడానికి వస్తారు. అయితే ఈ ప్రాసెస్ లో ఎక్కడో ఒకచోట వాళ్లకి నటన పైన ఆసక్తి కూడా కొంతమేరకు పెరుగుతుంది అని చెప్పాలి. ముందుగా షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ స్టార్ట్ చేసిన ప్రదీప్ రంగనాథన్ కోమాలి సినిమాతో డైరెక్టర్ గా మారిపోయాడు. ఆ తర్వాత తనే హీరోగా లవ్ టుడే అనే సినిమాకి దర్శకత్వం వహిస్తూ నటించాడు. ఆ తర్వాత వచ్చిన డ్రాగన్, రీసెంట్గా వచ్చిన డ్యూడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ కావడంతో నటుడుగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు.
మా నగరం సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు లోకేష్ కనగరాజ్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఖైదీ సినిమా నెక్స్ట్ లెవెల్. కమల్ హాసన్ చేసిన విక్రం సినిమా తర్వాత లోకేష్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. ఇక రీసెంట్ గా రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమాకి దర్శకత్వం వహించాడు లోకేష్. ఇక ప్రస్తుతం లోకేష్ అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోగా కనిపించనున్నాడు లోకేష్.
లోకేష్ దర్శకత్వంలో వచ్చిన కూలి సినిమా మీద అందరికీ విపరీతమైన అంచనాలు ఉండేవి. ఆ అంచనాలతోనే చాలామంది సినిమాకు వెళ్లారు. కానీ సినిమా ఊహించిన స్థాయిలో లేకపోవడం వలన చాలామంది నిరాశపడ్డారు. లోకేష్ ను ట్రోల్ కూడా చేశారు. మొత్తానికి ఆ సినిమాని ఒక ప్లాప్ లెక్కలోనే కొంతమంది పడేశారు.
అరుణ్ దర్శకత్వంలో కెప్టెన్ మిల్లర్ అని ధనుష్ నటించిన సినిమా వచ్చింది. ఆ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించారు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. అయితే అది కూడా ఒక ప్లాప్ సినిమానే.
ఇప్పుడు ఈ ఇద్దరు ప్లాప్ డైరెక్టర్లు కలిసి సన్ పిక్చర్స్ లో సినిమాను చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన రేపు రానుంది. రేపు వీరిద్దరి సినిమాను ప్రకటించబోతున్నట్లు ఒక అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.
పవన్ కళ్యాణ్ నటించిన ఓ జి సినిమాలోని గన్స్ అండ్ రోజెస్ అనే సాంగ్ ఎంత బాగా పాపులర్ అయిందో తెలిసిన విషయమే. ఇప్పుడు అదే తరహాలో పోస్టర్ పైన కూడా గులాబీ పువ్వులు మరియు గన్స్ పెట్టి అధికారికంగా సన్ పిక్చర్స్ ట్విట్టర్ అకౌంట్లో ఫోటోలు పోస్ట్ చేశారు. అయితే ఈ ఇద్దరు దర్శకులు కలిసి ఏ రేంజ్ సక్సెస్ కొడతారు వేచి చూడాలి.
లోకేష్ నటుడుగా మాస్టర్ సినిమాలో కనిపించారు. ఆ తర్వాత శృతిహాసన్ తో కలిసి ఒక సాంగ్ కూడా చేశారు. ఇక సినిమాలో హీరోగా ఏ మేరకు ఆకట్టుకుంటారో వేచి చూడాలి. లోకేష్ కూలి సినిమా ప్రమోషన్స్ అప్పుడు ఈ సినిమాకి సంబంధించిన గెటప్స్ లోనే కనిపించారు. అయితే అదే గెటప్ లో ఉంటారా లేకపోతే అరుణ్ వేరే గెటప్ ప్లాన్ చేశాడు అనేది కూడా కొద్ది రోజుల్లో తెలుస్తుంది.
Aslo Read : Biker Glimpse : మొత్తానికి శర్వానంద్ సినిమా వస్తుంది, దీని పరిస్థితి ఏంటో?