Sai Durga Tej : సాయి తేజ్ ప్రస్తుతం కొన్ని విలక్షణమైన సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. విరూపాక్ష సినిమా సక్సెస్ అయిన తర్వాత సాయి తేజ్ కథలను ఎంచుకునే విధానం కంప్లీట్ గా మారిపోయింది. సాయి తేజ్ డబ్ల్యూ సినిమా రేయ్ ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన పిల్ల నువ్వు లేని జీవితం మంచి సక్సెస్ అందుకుంది. సాయి తేజ్ కెరియర్లో హిట్ సినిమాలు కంటే కూడా ఎక్కువగా ప్లాప్ సినిమాలు ఉన్నాయి. సినిమా కథలను ఎంచుకునే విధానంలో సాయితేజ్ కొంత వెనకుంటాడని చెప్పాలి.
ఇకపోతే సాయితే జీవితంలో ఊహించని ఒక అనూహ్య సంఘటన జరిగింది. ఆ తరువాత మాట్లాడ్డానికి కూడా సాయి తేజ ఇబ్బంది పడుతూ ఉండేవాడు. అప్పుడు వచ్చిన విరూపాక్ష సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి సక్సెస్ సాధించి పెట్టింది. ఇప్పుడు ప్రస్తుతం సంబరాలు ఏటిగట్టు అనే ఒక పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు సాయి. ఈ సినిమా తర్వాత ఇద్దరు విలక్షణ దర్శకులు కాన్సెప్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
దాదాపు కిరణ్ అబ్బవరం కెరియర్ అయిపోతుంది అనుకునే టైంలో కొంచెం గ్యాప్ తీసుకొని క సినిమాతో గ్రేట్ కం బ్యాక్ ఇచ్చాడు కిరణ్. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమా సాధించిన సక్సెస్ కిరణ్ అబ్బవరం కు కొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఇక రీసెంట్ గా K-Ramp సినిమాతో కూడా మంచి సక్సెస్ అందుకున్నాడు కిరణ్. అయితే క సినిమా తీసిన దర్శకులు సుజిత్ & సందీప్ లకు సాయి ధరంతేజ్ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వీళ్లు చెప్పిన ఐడియా సాయికు విపరీతంగా నచ్చిందట. ప్రస్తుతం జరుగుతున్న సినిమా అయిపోయిన తర్వాత వీళ్ళతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి అని తెలుస్తుంది.
కాన్సెప్ట్ బేస్ సినిమాలకు ఎప్పుడు ఆదరణ లభిస్తుంది అని నిరూపించిన సినిమా క. తెలుగు ప్రేక్షకులు కూడా మంచి కాన్సెప్ట్ వస్తే ఎంత ప్రేమను చూపిస్తారో అని ఆ సినిమాతో మరోసారి రుజువు చేశారు. ఇదంతా కేవలం కాన్సెప్ట్ వల్లనే జరిగింది.
ఇప్పుడు సాయి తేజ తో సినిమా చేస్తే అదే తరహాలో మళ్లీ కాన్సెప్ట్ బేస్ సినిమాతో వస్తారా? లేకపోతే కమర్షియల్ సినిమా తీస్తారా? కానీ వీళ్లు సిద్ధం చేసే కథ చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే సంబరాలు ఏటిగట్టు అనే సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అయితే నెక్స్ట్ సుజిత్ మరియు సందీప్ చేయబోయే సినిమా దీనిని మించి ఉండాలి.
Also Read: Biker Glimpse : మొత్తానికి శర్వానంద్ సినిమా వస్తుంది, దీని పరిస్థితి ఏంటో?