Mass Jathara Movie Review : రవితేజ 75 వ సినిమాగా ‘మాస్ జాతర’ రూపొందింది. ఈ మధ్య రవితేజ వరుస ప్లాపుల్లో ఉండటం వల్ల.. ఈ సినిమాతో హిట్టు కొట్టి ఫామ్లోకి రావాలని అందరి హీరోల ఫ్యాన్స్ కోరుకున్నారు. మరి వారి విషెస్ తో రవితేజ హిట్టు కొట్టాడో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..
లక్ష్మణ్ భేరి(రవితేజ) ఓ రైల్వే పోలీస్. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అతనికి అన్నీ తానై పెంచుతాడు తాత(రాజేంద్రప్రసాద్). అతని కోరిక మేరకే పోలీస్ కావాలనుకున్న లక్ష్మణ్ జస్ట్ రైల్వే పోలీస్ దగ్గర ఆగిపోతాడు. అందువల్ల తన ఊర్లో జరిగే అన్యాయాలను అడ్డుకోలేకపోతున్నాను అనే ఫీలింగ్లో ఉంటాడు. అలాంటి లక్ష్మణ్ ఓ ఫారెస్ట్ ఏజెన్సీ ఏరియాకి ట్రాన్స్ఫర్ అవుతాడు. అక్కడ ఊర్లో ఉన్న జనాలతో గంజాయి పండించాలని ఒత్తిడి చేస్తుంటాడు శివుడు(నవీన్ చంద్ర).
ఒక రోజు అతను 20 టన్నుల గంజాయిని కోల్ కతా తీసుకువెళ్లాల్సి వస్తుంది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో గూడ్స్ ట్రైన్ ద్వారా ఆ సరకుని ఊరు దాటించాలి అనుకుంటాడు. కానీ అది లక్ష్మణ్ కి తెలిసి అతని ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. అక్కడ మొదలైన వీరి మధ్య వార్ చివరికి ఏ టర్న్ తీసుకుంది? మధ్యలో తులసి(శ్రీలీల) పాత్ర ఏంటి? అసలు హీరో తాత అతనికి పెళ్లి కాకుండా ఎందుకు అడ్డుకుంటున్నాడు? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
భాను భోగవరపు ‘సామజవరగమన’ ‘సింగిల్’ వంటి హిట్ సినిమాలకు రైటర్ గా చేశాడు. అతను ‘మాస్ జాతర’ తో దర్శకుడిగా మారుతున్నాడు అంటే కచ్చితంగా రవితేజకి కంబ్యాక్ హిట్ ఇస్తాడు అని అంతా ఆశపడటం సహజం. పైగా టాలెంట్ ఉన్న కొత్త దర్శకులను రవితేజ చాలా మందిని పరిచయం చేశాడు. మరి ఆ నమ్మకాన్ని భాను నిలబెట్టుకున్నాడా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి.
భాను స్ట్రెంత్ కామెడీ. రవితేజ కామెడీ టైమింగ్ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి కాంబో నుండి కంప్లీట్ కామెడీ అండ్ మాస్ ఎంటర్టైనర్ ఆశిస్తారు ప్రేక్షకులు. కానీ ‘మాస్ జాతర’ లో కామెడీ ఏమాత్రం పండలేదు. అంతా ఫోర్స్డ్ కామెడీనే. హైపర్ ఆది వంటి జబర్దస్త్ కమెడియన్స్ సినిమాలో బోలెడు మంది ఉన్నారు. కానీ ఒక్క పంచ్ కూడా ప్రేక్షకులకు గుర్తుండదు అంటే భాను తన స్ట్రెంత్ అంతా పక్కన పెట్టేసి.. రవితేజని ‘క్రాక్’ మోడ్లో చూపించి హిట్టు కొట్టేయాలని ట్రై చేసినట్టు అనిపిస్తుంది. పోనీ అలా అయినా ఆకట్టుకున్నాడా? అంటే అదీ లేదు.
‘క్రాక్’ని అటు తిప్పి ఇటు తిప్పి తీసిన ఫీలింగ్ వస్తుంది కానీ.. ఏ మాస్ ఎలిమెంట్ లేదు. నెరేషన్ కూడా ఫ్లాట్ గా అనిపిస్తుంది. నిర్మాత నాగవంశీ ప్రమోషన్స్ లో ఎందుకు కాన్ఫిడెంట్ గా మాట్లాడలేకపోయాడు అనే ప్రశ్న ఎవరిమైండ్లో అయినా ఉంటే.. వాళ్లకి సినిమా చూస్తున్నప్పుడు ప్రతి సీన్ కి సమాధానం దొరుకుతుంది. టెక్నికల్ గా మాత్రం సినిమా బాగానే ఉంది.
నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. భీమ్స్ ఒకటి, రెండు మంచి పాటలు ఇచ్చాడు. కానీ సాంగ్స్ మిక్సింగ్ చేయలేదు అనుకుంట.. చూస్తున్నప్పుడు లిరిక్స్ ఏమీ అర్ధం కాలేదు. ‘తూమెరా లవర్’ ‘సూపర్ డూపర్ హిట్ సాంగ్’ వంటివి బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుర్తుపెట్టుకునే రేంజ్లో లేదు. టీజర్లో ఉన్న ట్యూన్ నే రిపీటెడ్ గా కొట్టేశాడు.
నటీనటుల విషయానికి వస్తే.. ‘మాస్ జాతర’ ఏ క్యారెక్టర్ కి కూడా సరైన ఆర్క్ లేదు. రవితేజ నటన గురించి కొత్తగా చెప్పేది ఏముంటుంది. ఎలాంటి పాత్రకైనా అతను న్యాయం చేయగలడు. కానీ లక్ష్మణ్ భేరి పాత్రలో అతనికి కొత్తగా ఏం కనిపించి ఓకే చేశాడు అనేది అర్ధం కాదు. అతనిలో ఎనర్జీ ఏమీ తగ్గలేదు. కానీ కథల ఎంపిక సరిగ్గా లేకపోతే ఆ ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. అది ‘మాస్ జాతర’ తో ఇంకోసారి ప్రూవ్ అయ్యింది. నవీన్ చంద్రకి మంచి పాత్ర దొరికింది. కానీ ఎందుకో అతని కటౌట్ రవితేజ ముందు ఆనలేదు. చాలా వీక్ గా కనిపించాడు. ‘అరవింద సమేత’ లో బాల్రెడ్డి రేంజ్ పాత్ర అయితే కాదు కానీ.. ఇందులో కొంతవరకు విలనిజం బాగానే పండించాడు.
శ్రీలీల ఎప్పటిలానే పాటలకి, డాన్సులకే పరిమితమైంది. రాజేంద్ర ప్రసాద్ రోల్ సిల్లీగా మొదలై సీరియస్ గా ఎండ్ అయ్యింది. కానీ ఆ పాత్ర ఎమోషన్ తో ఆడియన్ కనెక్ట్ అవ్వడు. ‘క్రాక్’ లో వేటపాలెం బ్యాచ్ మాదిరి ‘మాస్ జాతర’ లో కూడా క్రూరంగా హత్యలు చేసే గ్యాంగ్ ఒకటి విలన్ కి ఉంటుంది. వాళ్ళ ఎపిసోడ్ వచ్చినప్పుడు సముద్రఖని ప్లేస్ లో నవీన్ చంద్ర ఉన్నాడు అంతే అనుకోవాలి. అన్నట్టు ఈ సినిమాలో సముద్రఖని కూడా ఉంటాడు. అతని పాత్ర టేబుల్ కి మాత్రమే పరిమితం చేశారు.
రవితేజ
ఇంటర్వెల్ సీక్వెన్స్
క్లైమాక్స్ లో విలన్ ఇంటికి వెళ్లి భోజనం చేసేప్పుడు వచ్చే ఫైట్ సీన్
2 పాటలు
ఫస్ట్ హాఫ్
ఫోర్స్డ్ కామెడీ
వీక్ విలన్
క్లైమాక్స్
మొత్తంగా ‘మాస్ జాతర’ ని రవితేజ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే తప్ప.. మిగిలిన ఆడియన్స్ సహనానికి పెద్ద పరీక్ష పెట్టే సినిమా.