Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడుగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. అప్పట్లో శివ సినిమా ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్జున్ రెడ్డి సినిమా అదే స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఒక కథను చెప్పే విధానం చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
ఆ సినిమా తర్వాత చేసిన అనిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది. తన కబీర్ సింగ్ సినిమాను వైలెంట్ ఫిలిం అన్నారు అని చెప్పి బాలీవుడ్ ప్రేక్షకులకి అసలైన వైలెంట్ ఫిలిం అంటే ఎలా ఉంటుందో అని అనిమల్స్ సినిమాతో సమాధానం చెప్పాడు. సందీప్ రెడ్డి వంగ విషయానికి వస్తే చూడడానికి కొంచెం అగ్రెసివ్ పర్సన్ లా కనిపిస్తాడు. కానీ తను మాట్లాడే విధానం, బాగా తెలిసిన వాళ్ళతో ఉండే విధానం చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే.
సందీప్ రెడ్డి వంగ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. బయట సందీప్ రెడ్డి వంగ కనిపిస్తే చాలు చాలామంది ఈజీగా గుర్తుపడతారు. ప్రభాస్ సినిమా గురించి అప్డేట్స్ అడుగుతూ ఉంటారు.
ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా సందీప్ మంచితనమేంటో ప్రూవ్ అవుతూ వచ్చింది. గతంలో గాయత్రీ గుప్తా తనకు హెల్త్ బాలేదు అని ఒక మెసేజ్ పెడితే త్వరగా డబ్బులు కూడా పంపించాడు సందీప్. తన హాస్పిటల్ కు సంబంధించి మంచి హెల్ప్ చేశారు.
ఇక తాజాగా తన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. వరంగల్ లో ఈ పెళ్లి జరిగింది. సందీప్ రెడ్డి వంగ ఈ పెళ్లికి హాజరై వధూవరులను దీవించాడు. దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ వీడియో మంచి ఆసక్తిని కలిగించింది.
ప్రభాస్ బర్త్డే కానుకగా వచ్చిన అన్ని అనౌన్స్మెంట్ కంటే స్పిరిట్ సినిమా అనౌన్స్మెంట్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అనే క్యూరియాసిటీ ఇప్పటికే చాలామందికి మొదలైంది. ఈ సినిమా దాదాపు 100 రోజుల్లోనే ఫినిష్ చేసే ప్లాన్ లో ఉన్నాడు సందీప్.
Also Read: Dhruv Vikram : రియల్ కబడ్డీ ప్లేయర్ కార్తిక ను కలిసి అభినందనలు తెలిపిన ధృవ్