Actor Dharmendra: బాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సీనియర్ నటుడు ధర్మేంద్ర(Dharmendra) ఒకరు. సుమారు 300కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన తాజాగా హాస్పిటల్ పాలయ్యారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ధర్మేంద్ర హాస్పిటల్ లో అడ్మిట్ కావడంతో ఏం జరిగిందని అభిమానులు కంగారు వ్యక్తం చేస్తున్నారు. పలు నివేదికల ప్రకారం ధర్మేంద్ర ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడలేదని అయితే ఆయన సాధారణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ కి వెళ్ళారని తెలుస్తోంది.
డిసెంబర్ నాటికి ధర్మేంద్ర 90వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇలా వృద్ధాప్యంలో ఉన్న ఈయన తరచూ ఆరోగ్యపరంగా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నేడు కూడా ఈయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ (Breach Candy Hospital) కి వెళ్ళారు.వయస్సు సంబంధిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ధర్మేంద్రను కొన్ని పరీక్షల కోసం చేర్చారు. అయితే ఎవరూ కూడా ఈయన ఆరోగ్య విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలియజేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈయన కంటికి సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే.
ధర్మేంద్ర సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారనే విషయం తెలిసిన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే ధర్మేంద్ర షోలే, చుప్కే చుప్కే, అనుపమ, సీతా ఔర్ గీతా, ధర్మ వీర్, మృత్యు లాంటి సినిమాలను నటించారు ఈయన తన సినీ కెరియర్లు ఇప్పటివరకు 300 కు పైగా సినిమాలలో నటించి నటుడిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక ఈ వయసులో కూడా ధర్మేంద్ర తన వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈయన శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించిన ‘ఇక్కిస్’లో అగస్త్య నందా, సిమర్ భాటియాతో కలసి కనిపించబోతున్నారు.
బాబీ డియోల్..
ఇక ధర్మేంద్ర ఇద్దరు కుమారులు కూడా ఇండస్ట్రీలో స్టార్ నటులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీలో సన్నీడియోల్(Sunny Deol), బాబీ డియోల్(Boby Deol) ఇద్దరు కూడా ధర్మేంద్ర కుమారులు అనే విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ తమ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నప్పటికీ నిరంతరం తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి సమాచారం తెలుసుకుంటూనే ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో నటుడు బాబీ డియోల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుని ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
Also Read: Allu Sirish Engagement: ఘనంగా అల్లు శిరీష్ నైనిక నిశ్చితార్థం.. పెళ్లి ఎప్పుడంటే?