Biker Glimpse : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాలెంటెడ్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. నటుడుగా కొన్ని సినిమాల్లో కనిపించిన శర్వానంద్ ఆ తర్వాత హీరోగా కూడా మారిపోయారు. శర్వానంద్ హీరోగా మారిన తర్వాత చేసిన సినిమాలలో కొన్ని గొప్ప సినిమాలు ఉన్నాయి. ప్రస్థానం, గమ్యం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఒకే ఒక జీవితం వంటి సినిమాలు శర్వానంద్ కి మంచి పేరుని తీసుకొచ్చాయి. అయితే శర్వానంద్ కెరియర్ లో సూపర్ హిట్ సినిమాలు కంటే కూడా డిజాస్టర్లే ఎక్కువగా ఉన్నాయి.
సినిమా ఫెయిల్ అయిన శర్వానంద్ మాత్రం ఫెయిల్ అవ్వడు. సినిమా మీద తనకి ప్యాషన్ గురించి ఎంత చెప్పనా తక్కువే అవుతుంది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన మనమే సినిమా తర్వాత ఇప్పటివరకు శర్వానంద్ కెరియర్ లో ఒక సినిమా కూడా రిలీజ్ కాలేదు. మనమే సినిమా ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది. ఇక ప్రస్తుతం యు వి క్రియేషన్స్ లో బైకర్ అనే సినిమా చేస్తున్నాడు శర్వానంద్.
శర్వానంద్ నుంచి సినిమాలు రావట్లేదు అనుకునే తరుణంలో ఒక్కసారిగా మూడు ప్రాజెక్టులు అనౌన్స్ చేసేసాడు. అయితే ఒక సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది. నారీ నారీ నడుమ మురారి అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
గతంలో భారీ సినిమాల మధ్య వచ్చిన శతమానం భవతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు కూడా నారీ నారీ నడుమ మురారి సినిమా సక్సెస్ అయితే అప్పటి లెక్క రిపీట్ అయింది అని చెప్పొచ్చు. లేకపోతే అతి పెద్ద రిస్క్ అవుతుంది.
ఇంకా శర్వానంద్ నటిస్తున్న బైకర్ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ రేపు విడుదల కానుంది. ఈ సినిమా శర్వానంద్ కెరీర్ కి చాలా కీలకము. ఎందుకంటే ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డాడు. బరువు కూడా విపరీతంగా తగ్గిపోయి పోల్చుకోలేని స్థితికి వెళ్ళిపోయారు. ఒక సినిమా కోసం అంత కష్టపడినప్పుడు ఫలితం దక్కాల్సిందే అని చాలామంది ప్రేక్షకులు కూడా అనిపిస్తుంది.
గతంలో నాగశౌర్య కూడా లక్ష్య అనే సినిమా కోసం విపరీతంగా మారిపోయాడు. సిక్స్ ప్యాక్ కూడా ఆ సినిమా కోసం చేశాడు. కానీ ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. రేపు రిలీజ్ కాబోయే బైక్ టీజర్ చూసిన తర్వాత సినిమా గురించి ఒక అవగాహన వస్తుంది.
Also Read: Champion Movie : రిస్కు తీసుకొని కొనుక్కోవాల్సిందే, రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు