Dhruv Vikram : కొన్ని సినిమాలు అయిపోయిన తర్వాత కూడా మనతో ప్రయాణిస్తూ ఉంటాయి. ఆ సినిమాలోని సీన్స్ వెంటాడుతూ ఉంటాయి. ఆ పాత్రలు కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి. అతి తక్కువసార్లు మాత్రమే ఇది జరుగుతుంది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన బైసన్ సినిమా అక్టోబర్ 17న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. తెలుగులో అప్పటికే నాలుగు సినిమాలు విడుదల అవుతుండటంతో ఈ సినిమాను అక్టోబర్ 24న తెలుగులో విడుదల చేశారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు.
ఆదిత్య వర్మ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ధృవ విక్రమ్. అది అర్జున్ రెడ్డి సినిమాకు రీమేక్ కాబట్టి పెద్దగా పేరు సాధించలేదు. ఆ తర్వాత కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన మహాన్ సినిమాలో కనిపించాడు ఆ సినిమా విక్రమ్ ఖాతాలోకి వెళ్లిపోయింది. మొదటిసారి బైసన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినట్టే చెప్పుకోవాలి. అయితే కోలీవుడ్ వర్గాల్లో ఈ సినిమాకు విపరీతమైన గుర్తింపు లభించింది. అలానే కమర్షియల్ సక్సెస్ కూడా అందుకుంది.
ఇటీవల బహ్రెయిన్‌లో జరిగిన ఆసియా యూత్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన భారత U-18 మహిళల కబడ్డీ జట్టుకు వైస్-కెప్టెన్‌గా ఆడిన కార్తీక, భారతదేశం మరియు తమిళనాడుకు కీర్తిని తెచ్చిపెట్టింది. మరియు ఫైనల్ మ్యాచ్‌లో ఇరాన్‌పై విజయంలో కీలక పాత్ర పోషించింది.
అయితే ఈ టీంకు దర్శకుడు మారి సెల్వరాజ్ ఇదివరకే అభినందనలు తెలియజేస్తూ ఐదు లక్షల విరాళాన్ని కూడా ప్రకటించారు. ఇక తాజాగా ధ్రువ విక్రమ్ కబడ్డీ జట్టుకు వైస్ కెప్టెన్ గా ఆడిన కార్తికను కలిసి తన అభినందనలు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మామూలుగా కొంతమంది సినిమాలు గురించి మాట్లాడుతూ ఈ సినిమా మేము చాలా కష్టపడి చేశామని చెబుతూ ఉంటారు. కానీ బైసన్ సినిమా విషయానికి వస్తే నిజంగానే కష్టపడి చేశాడు అని ఎవరు చెప్పకుండానే సినిమా చూస్తే అర్థమవుతుంది. దాదాపు సంవత్సరానికి పైగా రియల్ కబడ్డీ కోచ్ తో ట్రావెల్ చేసి కబడ్డీ నేర్చుకున్నాడు ధ్రువ విక్రం.
అలా సిన్సియర్ గా నేర్చుకోవడం వల్ల సినిమాలో కూడా తన ఎఫర్ట్ కనిపించింది. ఒక సినిమా కోసం ఇంతలా కష్టపడతారా అని తనను చూస్తే అర్థమైంది. కేవలం తను మాత్రమే కాదు తన తండ్రి విక్రమ్ కూడా అలా కష్టపడటం వల్లనే ఇప్పటికీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం ఉన్నాయి అని చెప్పొచ్చు.
Also Read: Sai Durga Tej : ఆ విలక్షణ దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి తేజ్