The Girl Friend: కొన్నిసార్లు సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్లడానికి ఈ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది దర్శక నిర్మాతలు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా విషయంలో కూడా ఒక ప్రమోషనల్ సాంగ్ ని ప్లాన్ చేశారు. అయితే ఆ ప్రమోషనల్ సాంగ్ కు దాదాపు కోటి రూపాయలు ఖర్చయిందట. వింటేనే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా అసలు ఏం జరిగిందనేది నిర్మాత ధీరజ్ తెలిపాడు.
ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి సంబంధించి రెగ్యులర్ గా కాకుండా ఒక వీడియో సాంగ్ షూట్ చేసి విడుదల చేద్దాం అని నేను డైరెక్టర్ తో చెప్పాను. ఓకే బ్రో చేద్దాం, మీరు ఒక సాంగ్ కోసం అంత ఖర్చు పెట్టాలి అనుకుంటే ఒక డైరెక్టర్ గా నాకు కూడా హ్యాపీ కదా అని రాహుల్ రవీంద్రన్ కూడా ఓకే చెప్పాడు.
సాంగ్ కు సంబంధించి చాలా రీసెర్చ్ చేసాం. చాలా రిఫరెన్సులు వెతికాము. దీని బ్యాక్ డ్రాప్ ఎక్కడ చేయాలి అని తిరిగాము. అవుట్డోర్ లొకేషన్ అంటే చాలా దూరం వెళ్ళాలి అదంతా టైం టేకెన్ ప్రాసెస్ అని సెట్ ఏద్దామని ఫిక్స్ అయిపోయాం. సెట్ వేసినప్పుడు కూడా ఒక వీడియో సాంగ్ కి అంత అవుతుంది అని నాకు తెలియదు. నేను కూడా అనుకోలేదు.
దీనిలో నాదే మిస్టేక్ అనుకోకుండా నేను యూరోప్ లో ఉన్నాను. కాల్స్ కు కూడా కొంచెం గ్యాప్ ఉంటుంది. సడన్ గా రెండు రోజులు ముందు నాకు బడ్జెట్ షీట్ వచ్చింది అది చూసి నేను షాక్ అయిపోయాను. ఒక ప్రమోషనల్ సాంగ్ కి ఇంత బడ్జెట్ ఏంటి అని ఆశ్చర్యపోయాను.
ఒక పాతిక లక్షలు అయితే పర్వాలేదు సార్, కేవలం ఒక పాట కోసం కోటి రూపాయలు అయిపోయింది. నేను బడ్జెట్ చూసినప్పుడు కేవలం ఆర్ట్ బడ్జెట్ 50 లక్షలు వచ్చింది నాకు ఏమీ అర్థం కాలేదు. పాపం డైరెక్టర్ కూడా నాకంటే కొన్ని గంటలు ముందే చూసాడు. ఆయన కూడా షాక్ అయిపోయాడు.
కాకపోతే ఆ సాంగ్ కోసం అప్పటికే వర్క్ చేసాము. రష్మిక కూడా డాన్స్ రిహాసల్స్ కూడా స్టార్ట్ చేసేసారు. ఇంత బడ్జెట్ అయినా కూడా పరవాలేదులే సాంగ్ హిట్ అయిపోతే అదే హ్యాపీ అనే కాన్ఫిడెంట్ తో ముందుకెళ్ళిపోయా.
మామూలుగా ఈ సాంగ్ పూర్తయ్యేసరికి కోటి రూపాయలు బడ్జెట్ అయిపోయింది. ఈ విషయాన్ని చాలా రోజుల వరకు అరవింద్ గారికి చెప్పకుండా దాచిపెట్టుకున్నాం. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో తెలిసిపోద్ది కదా. కోటి రూపాయలు ఒక సాంగ్ మీద ఖర్చు పెట్టడం అనేది పెద్ద బూతు. అంటూ అసలైన కథను చెప్పాడు ధీరజ్.
Also Read: The Girl Friend: సితార బ్యానర్ కు ఏమైంది? ది గర్ల్ ఫ్రెండ్ ని కూడా వదులుకున్నారు