The Girl Friend: కొన్ని సినిమాలు ఎక్కడ మొదలై ఎక్కడ వరకు వెళ్తాయో ఎవరూ ఊహించలేరు. నటుడుగా మంచి గుర్తింపు సాధించుకున్న రాహుల్ రవీంద్రన్ చి ల సౌ అనే సినిమాతో దర్శకుడుగా మారాడు. ఆ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది. ఆ సినిమా తర్వాత చేసిన మన్మధుడు సినిమా ఊహించిన సక్సెస్ అందుకోలేకపోయింది. ఆ తర్వాత నటుడుగానే సినిమాలు చేశాడు రాహుల్. ఇక రష్మిక హీరోయిన్ గా ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకులు ముందుకు రానుంది.
ఈ సినిమా రిలీజ్ కి సిద్ధమవుతున్న తరుణంలో నిర్మాత ధీరజ్ కూడా పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నారు. ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశాడు నిర్మాత ధీరజ్.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న బ్యానర్స్ లో సితార బ్యానర్ కు మంచి గుర్తింపు ఉంది. ఈ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. కానీ 2026లో మాత్రం ఈ బ్యానర్ కి అనుకున్నవి అనుకున్నట్లు వర్కౌట్ కావడం లేదు అని చెప్పాలి.
నిర్మిస్తున్న సినిమాలు మాత్రమే కాకుండా, డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలు కూడా ఊహించిన సక్సెస్ ఇవ్వలేకపోతున్నాయి. ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాను తెలుగులో నాగ వంశీ డిస్ట్రిబ్యూషన్ చేయటం వలన తీవ్రమైన నష్టాలు ఎదుర్కొన్నాడు.
అయితే ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా సితార ఎంటర్టైన్మెంట్స్ లో వంశీ చేయాలి. ఒక తరుణంలో స్క్రిప్ట్ చదవమని ధీరజ్ కు ఇచ్చాడు వంశీ. అలా ధీరజ్ కు స్క్రిప్ట్ నచ్చడంతో ఆ సినిమాను ప్రొడ్యూస్ చేశాడు. మరోవైపు కరోనా టైం లో కూడా ఇదే కథను రాహుల్ రవీంద్రన్ అల్లు అరవింద్ కు ఆహా కోసం చెప్పారు.
ధీరజ్ దగ్గరికి కథ వచ్చిన తరువాత అల్లు అరవింద్ కు చెప్పినప్పుడు. రాహుల్ రవీంద్రన్ కు అల్లు అరవింద్ కాల్ చేసి అప్పట్లో నువ్వు చెప్పిన కథ ఇదేనా అంటూ అడిగి కన్ఫామ్ చేసుకున్నారు. మొత్తానికి ఎక్కడో అవ్వాల్సిన ప్రాజెక్ట్ గీతా లో వచ్చి పడింది.
ఇక రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ అయితే విపరీతంగా ఆకట్టుకుంది. కానీ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో నవంబర్ 7న తెలుస్తుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి మంచి కలెక్షన్లు వస్తే సితార బ్యానర్ ఒక మంచి సినిమాను కోల్పోయినట్లే అని చెప్పాలి.
అద్భుతమైన సినిమాలను నిర్మించే ఈ బ్యానర్ జడ్జిమెంట్ ఎక్కడైనా దెబ్బతిందా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే బ్యానర్ లో అనుదీప్ ఫంకీ, వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య చేస్తున్న సినిమాతో పాటు, కళ్యాణ్ శంకర్ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు.
Also Read: Sandeep Reddy Vanga: అసిస్టెంట్ డైరెక్టర్ పెళ్లికి హాజరైన సందీప్ రెడ్డి వంగ, కనిపించిన వ్యక్తిత్వం