BigTV English
Advertisement

Monthly Horoscope in Telugu: ఈ నెల రాశిఫలాలు: నవంబర్ లో ఆ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి – వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి

Monthly Horoscope in Telugu: ఈ నెల రాశిఫలాలు: నవంబర్ లో ఆ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి – వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి

Monthly Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన నవంబర్‌ నెల రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:  

ఈ రాశి వారికి పనులలో శారీరక శ్రమ అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో గృహమున సందడిగా గడుపుతారు. సంతాన వివాహ విషయంలో శుభవార్తలు అందుతాయి.   ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ మరింత పెరుగుతుంది. నిరుద్యోగులకు చిన్నపాటి కష్టంతో నూతన అవకాశాలు పొందుతారు.  

వృషభ రాశి:

ఈ రాశి వారు చేపట్టిన అన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన లాభాలు పొందుతారు. మాసం మధ్య నుండి దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో చీటికిమాటికి వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. గృహ నిర్మాణయత్నాలలో ఊహించని అవరోధాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి.  


మిథున రాశి:  

ఈ రాశి వారు చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగవుతుంది. కొన్ని సమస్యలను స్నేహితుల చొరవతో పరిష్కరించుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. సంతానం విద్యా విషయాలలో పురోగతి కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను అధికారుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలలో స్వంత నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది.  

కర్కాటక రాశి:

ఈ రాశి జాతకులు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభపడతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగస్తులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న పదవులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించిన నూతన అవకాశాలు లభిస్తాయి.  

సింహరాశి:

ఈ రాశి వారికి ఈ మాసం కూడా అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన వ్యవహారాలలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. ఎంతటి వారినైనా మీ మాట మీదకి తీసుకొస్తారు. శత్రు పరమైన సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సంతానం ఆరోగ్య విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. మాసం చివరన దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.  

కన్యారాశి :

ఈ రాశి వారికి  ఈ నెల మొదటి భాగంలో  పనులలో అవరోధాలు తొలగుతాయి. కొన్ని వ్యవహారాలలో బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు పెట్టకపోవటం మంచిది. ద్వితీయార్థం నుండి పరిస్థితులు మెరుగుపడతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. గృహమున శుభకార్యాల గూర్చి బంధుమిత్రులతో చర్చలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాలలో కార్యసిద్ధి కలుగుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతుల పెరుగుతాయి. విద్యార్థులు విదేశీ ప్రయాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి.  

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

నెలలో మీరు చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వాహన ప్రయాణాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో పెద్దల సలహాలతో ముందుకు సాగడం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు మరొకసారి నిరాశ తప్పదు. కొన్ని విషయాలలో తొందరపాటు వలన ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపుల అవసరమవుతాయి. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. మాసం చివరన దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు

వృశ్చికరాశి:

ఈ రాశి వారు ఈ నెలలో చాలా కాలంగా పూర్తి కాని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు కొంత ఇబ్బందికరంగా ఉన్న అవసరానికి ధన సహాయం అందుతుంది.  వాహన ప్రయాణ విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి.  

ధనస్సు రాశి:

నెలలో అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఆదాయం తగినంత లభిస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.  ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సంతానం విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.  

మకరరాశి:

ఈ రాశి వారికి ఈ నెలలో  ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అవరోధాలు కలిగినప్పటికీ కొంత నిదానంగా పూర్తి చేయగలుగుతారు. సమాజంలో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సంతాన పరంగా శుభవార్తలు అందుకుంటారు. ప్రయాణ అనుకూలత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో చివరి నిముషాల్లో నిర్ణయాల మార్పు వల్ల లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు.    

కుంభరాశి:

ఈ రాశి వారికి ఈ మాసం అంతగా అనుకూలంగా ఉండదు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. వృత్తి వ్యాపారాలు అంతగా రాణించవు. ఆర్థికంగా మరింత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. చుట్టుపక్కల వారితో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. స్త్రీ సంబంధిత వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహ నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి.  

మీనరాశి:

ఈ రాశి వారికి ఈ మాసం కూడా అంతగా అనుకూలించదు. వృత్తి వ్యాపారాలలో రాణింపు ఉండదు ఆదాయపరంగా కొంత ఒడిదుడుకులు అధికమవుతాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలలో ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపార విషయంలో ప్రభుత్వ సంబంధిత జరిమానాలు కట్టాల్సి రావచ్చు. ఇంటా బయటా కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. గృహమున ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. మాసంతమున కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.  

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (01/11/2025) ఆ రాశి వారికి  అకస్మిక ధనలాభం – నిరుద్యోగులకు శుభవార్తలు 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (31/10/2025) ఆ రాశి వారికి వ్యాపారంలో నష్టాలు – వారికి బంధువులతో గొడవలు  

Palmistry: అరచేతుల్లో ఈ మూడు గుర్తులు ఉంటే చాలు, జీవితంలో డబ్బుకు లోటే ఉండదు

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (30/10/2025) ఆ రాశి వారికి అకస్మిక ప్రయాణాలు – పాత బాకీలు వసూలవుతాయి

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (29/10/2025) ఆ రాశి వారికి వ్యాపారంలో నష్టాలు – ఉద్యోగులకు ప్రమోషన్లు 

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (28/10/2025) ఆ రాశి వారికి వ్యాపారంలో లాభాలు – రాజకీయ ప్రముఖులతో పరిచయాలు  

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు (27/10/2025) ఆ రాశి వారికి శుభవార్తలు – కొత్త వ్యక్తుల పరిచయాలు

Big Stories

×